రియల్ లైఫ్ లో వెంకటేష్, నాగచైతన్య మామాఅల్లుళ్లు అన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా మామ అల్లుళ్ళుగా కలిసి మొదటిసారి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘వెంకీ మామ’. క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మ‌ల్టీస్టారర్‌లో రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా ర‌టిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య.. జవాన్ పాత్రలో నటిస్తున్నాడు. జై జవాన్..జై కిసాన్ నేపథ్యంలో దర్శకుడు బాబీ (కే.యస్.రవీంద్ర) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిజ జీవితంలో మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు.

 

బాబీ తెరకెక్కించిన ‘వెంకీ మామ’ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి ‘వెంకీ మామ’ అనే టైటిల్ రావడానికి నాగ చైతన్యనే కార‌ణ‌మ‌ట‌. తన రియల్ లైఫ్, రియల్ ఫీలింగ్ నుంచే ఈ టైటిల్ ని తీసుకున్నారట. ఈ సినిమా కోసం ఏం టైటిల్ పెట్టాలా అని ఆలోచ‌న‌లో ఉన్నప్పుడు ఒకరోజు సురేష్ బాబు గారు కాల్ చేసి ‘వెంకీ మామ’ టైటిల్ ఎలా ఉంది..? నాగ చైతన్య ఎప్పుడు వెంకీ ని వెంకీ మామ అనే పిలుస్తాడని చెప్పారు. అది విన్న నాకు ఈ సినిమాకి వెంకీ మామ‌నే పర్ఫెక్ట్ టైటిల్ అనిపించింద‌ని, అందుకే ఫిక్స్ చేశామ‌ని ఈ చిత్ర డైరెక్టర్ బాబీ చెప్పాడు. కాగా, ఈ సినిమా వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల కానుంది. 

 

బాబీ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న వెంకీ మామ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయినా వెంకీ మామ టీజ‌ర్‌, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంగీత దర్శకుడు తమన్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన మరో సాంగ్ కైడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  వాస్త‌వానికి దర్శకుడు బాబీ చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. దీనిని సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఈ సినిమాని మొదటగా సంక్రాంతి బరిలో దించాలని అనుకున్నారు . కానీ భారీ సినిమాలు లైన్ లో ఉండడంతో డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: