ఈ మద్య టెలివిజన్ రంగంలో యాంకర్ల హవా నడుస్తుంది.  జబర్ధస్త్ పుణ్యమా అని యాంకర్లు చాలా మోడ్రన్ గా తయారయ్యారు.  సినిమా హీరోయిన్ల కన్నా హాట్ లుక్ తో కనిపిస్తున్నారు.  జబర్ధస్త్ లో వస్తున్న అనసూయ, రష్మి తమ అందాలచందాలతో బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా సత్తా చాటుతున్నారు.  ఇక బుల్లితెరపై టాప్ రేసులో సుమ చాలా ట్రెడిషనల్ గా  దూసుకుపోతుంటే ఆ తరువాత స్థానాల్లో అనసూయ, రష్మి తమ గ్లామర్ షోతో నిలిచారు.  ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఈ యాంకర్లదే జోరు కొనసాగుతుంది.. ఒకవేళ వీరితో కాంపిటీషన్ లో ఉండాలంటే మాటల చాతుర్యమే కాదు గ్లామర్ డోస్ బాగా పెంచాల్సిందే అన్న పరిస్థితి నెలకొంది.  

 

అయితే ఇలాంటి కాంపిటిషన్ లో కొంతమంది లేడీ యాంకర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సంఘటలను ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  తాజాగా ఓ యాంకర్ లైవ్ లో చేసిన పనికి అందరూ షాకవుతున్నారు.  గత కొంత కాలంగా బుల్లితెరపై జబర్ధస్త్ తర్వాత పటాస్ కి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమాన్ని యాంకర్ రవి, శ్రీముఖి లు తమదైన స్టైల్లో ఉర్రూతలూగించే వారు. అయితే బిగ్ బాస్ లోకి శ్రీముఖి వెళ్లిన తర్వాత ఆమె ఈ షోకి దూరమైంది.  మరికొన్ని కారణాల వల్ల యాంకర్ రవి సైతం పటాస్ కి దూరంగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో జబర్ధస్త్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన చలాకీ చంటీ ఈ షోలో యాంకర్ గా కొనసాగుతున్నారు.

 

చంటితో కలిసి యాంకర్ వర్షిణి కూడా ఈ షోకి యాంకరింగ్ చేస్తోంది. తాజాగా ఈ షోలో భాగంగా వర్షిని అందులో పాల్గొన్న విద్యార్థులను కొన్ని చిలిపి ప్రశ్నలు అడగడం వారు ఫన్నీ సమాధానాలు చెప్పడం జరుగుతుంది.  ఈ క్రమంలో వారు అడిగిన ఓ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నిల్చున్న ఓ అబ్బాయిని చూసి చాలా క్యూట్ గా ఉన్నాడంటూ స్టేజ్ పైకి పిలిచింది వర్షిణి.  స్టేజ్ పైకి వచ్చిన ఆ కుర్రాడి బుగ్గలు బాగున్నాయని యాపిల్ పండులా ఒక్కసారే కొరికేసింది. అంతే పక్కన ఉన్న చలాకీ చంటీకి దిమ్మతిరి షాక్ తిన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: