నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో రూలర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా రిలీజ్ అవకుండానే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు బాలకృష్ణ. కొన్నాళ్ళుగా వార్తల్లో ఉన్న బోయపాటి శ్రీను సినిమాకు ముహూర్తం పెట్టాడు బాలకృష్ణ. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.

 

సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ షార్టేజ్ ప్రాబ్లం ఉంది. అయితే వారు కూడా ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాని హీరోయిన్స్ మాత్రం సీనియర్ హీరోలతో చేసేందుకు సుముఖంగా లేరు. మహానటి తర్వాత సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలకృష్ణ సినిమా ఒకే చేస్తే కనుక సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు.

 

అంతేకాదు బాలకృష్ణ బోయపాటి కాంబో సినిమాలో మరో హీరోయిన్ కు అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ ఛాన్స్ ఈసారి బుల్లితెర హాట్ యాంకర్ కం హీరోయిన్ రశ్మికి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు గ్లామరస్ పాత్రలో నటించిన రశ్మి మొదటిసారి ఒక స్టార్ సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. అదిగాక బాలకృష్ణ సినిమా అంటే అది మామూలు విషయం కాదు.

 

కచ్చితంగా రశ్మికి ఇదో మంచి అవకాశం అవుతుందని చెప్పొచ్చు. జబర్దస్త్ యాంకర్ గానే కాదు సిల్వర్ స్క్రీన్ పై గుంటూర్ టాకీస్ లాంటి సినిమాలు చేస్తున్న రశ్మికి బాలయ్య సినిమా ఆఫర్ రావడం నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. సరైన ఛాన్స్ వస్తే తానెంతో ప్రూవ్ చేసుకుంటా అని చెబుతున్న రశ్మి ఈ క్రేజీ ఆఫర్ తో సత్తా చాటాలని చూస్తుంది. బాలకృష్ణ సినిమాలో రశ్మి నటిస్తున్న విషయం నిజమే అయితే ఆమె కెరియర్ కు ఈ ఛాన్స్ ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: