సినిమా హీరోగా అవకాశాల కోసం ఎంత కష్టపడతామో అది రాగానే మొదటి సినిమా ఎలాగోలా చేసేస్తాం. అది కాస్త హిట్ అయితే ఆ క్రేజ్ చూసి కొద్దిగా రిలాక్స్ అయిపోతారు. ఇక తమకు నచ్చినట్టుగా సినిమాలు చేస్తూ వస్తారు. ఇలా ఐదారు సినిమాలు చేశాక చూస్తే ఏముంటుంది మొదటి రెండు సినిమాలు హిట్టైనా ఆ తర్వాత హీరో ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ కెరియర్ లో వెనుక పడాల్సి వస్తుంది.

 

ఇలా చాలామంది మొదటి హిట్టుకి మురిసిపోయి ఇక తనకి తిరుగు లేదని వెళ్లి బొక్క బోర్లా పడ్డ వాళ్ళే. రీసెంట్ గా కూడా ఒక హీరో ఇదే పంథాలో వెళ్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఆరెక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత వరుస ఫ్లాపులు చేస్తున్నాడు. హిప్పి, గుణ 369 సినిమాల్లో నటించిన కార్తికేయ ఆ సినిమాలతో నిరాశపరచాడు. 

 

అయితే నానితో గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా చేసి మెప్పించాడు ఈ యువ హీరో. లేటెస్ట్ గా 90 ఎం.ఎల్ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం రిలీజైన ఈ సినిమాలో కూడా పెద్దగా మ్యాటర్ ఏం లేదు అన్నది పబ్లిక్ టాక్. అయితే ఆరెక్స్ 100  వరకు ఒకే కాని హిప్పి, గుణ 369 90 ఎం.ఎల్ ఈ సినిమాల్లో కార్తికేయ యాక్టింగ్ ఒకే విధంగా ఉంది అన్నది అందరి మాట.

 

నటుడిగా సినిమా సినిమాకు పరిణితి చెందాలి కాని కార్తికేయలో అలాంటి మార్పు కనిపించడం లేదని అంటున్నారు. కుర్రాడి వేగానికి మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే మాత్రం మళ్ళీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో పడుతుంది. అయితే కథల విషయంలో కచ్చితంగా కార్తికేయ మరోసారి ఆలోచించాలని అంటున్నారు.  అయితే ఎనర్జీ విషయంలో మాత్రం ఒక స్టార్ హీరో అయ్యే అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: