తెలంగాణ పోలీసులు  దిశ నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడంపై  దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ  సమర్థిస్తున్నారు.  సోషల్‌ మీడియా వేదికగా దిశకు న్యాయం జరిగిందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ శనివారం నటి పూనమ్‌ కౌర్‌ దిశ ఎన్‌కౌంటర్‌పై సిని  స్పందించారు. ఆమె తెలంగాణ పోలీసులకు దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసినందుకు  కృతజ్ఞతలు తెలిపారు. 

 

 ఆమె దిశ నిదితుల్ని ఎన్ కౌంటర్ చేయటం అభినందనీయమని సంతోషం వ్యక్తంచేశారు. దిశ ఘటన తెలిసి తానుఎంతో ఆవేదన చెందాననీ.. ఆందోళన చెందానని కానీ.. నిందితులకు ఇంత త్వరగా శిక్ష వేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడినవారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇక  ఇటువంటి అన్యాయం ఏ ఆడపిల్లకు  జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు..ప్రభుత్వాలకు ఉందన్నారు.

 

ఇలా పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే...పూనమ్  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది .పూనమ్  ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది  .. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. కానీ  అప్పటికే ఆ  ట్వీట్ వైరల్‌గా మారింది.ఇక అస్సలు విషయం ఆ టిట్ లో ఏముందంటే ....పూనమ్ ‘ ఉదయమే మంచి వార్త విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అని  ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ పేరును ప్రత్యక్షంగా వాడనప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటలను కామెంట్ చేసింది. దీంతో  అందరికీ ఆమె ట్వీట్‌ పవన్‌కేనని  అర్థమైంది. 

 

కాగా, పవన్‌ కళ్యాణ్  కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై స్పందిస్తూ.. ‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు.అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు తగిలిస్తే సరిపోతుంది’  అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: