ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు కొంతమందికి అరుదుగా లభిస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నటిగా సత్తా చాటి కెరీర్ పరంగా వెలిగిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్స్ చాలానే ఉన్నారు. రీసెంట్‌గా యాంకర్ అనసూయ అలానే నిరూపించుకుంది. సుక్కూ- చరణ్ ల రంగస్థలంలో రంగమ్మత్తగా అద్భుతంగా నటించి యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అనసూయకు చాలా సినిమాలలో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

 

తాజా సమాచారం ప్రకారం.. జబర్ధస్త్ యాంకర్ కం నటి రేష్మీని అదిరిపోయే ఆఫర్ వెతుక్కుంటూ వచ్చిందని లేటెస్ట్ న్యూస్. అది కూడా నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కనున్న ఎన్.బి.కే 106 లో ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాలో రేష్మికి నటిగా నిరూపించుకునే అవకాశమే దక్కిందట. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందని ఫిల్మ్ నగర్ లో టాక్. అయితే ఇదే పాత్రకు ముందు అనసూయ ని బోయపాటి సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించిందన్న వార్త నడుస్తోంది. అందుకు కారణం అనసూయ పలు టీవీ కార్యక్రమాలు సహా సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. డేట్స్ సమస్య వల్లనే కాదనుకోవడంతో రష్మీకి ఆ అవకాశం వెళ్లిందని తెలుస్తోంది.  

 

ఏదేమైనా రష్మీకి ఒక టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో భారీ స్పాన్ ఉన్న అవకాశం దక్కింది. నిరూపించుకోవడం తన చేతిలోనే ఉంది. ఇక రష్మి ఇంతకుముందు గుంటూర్ టాకీస్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మొరటు కుర్రాడితో ఘాటైన రొమాన్స్ లో అదరగొట్టేసింది. అయితే ఆ తర్వాత తనని తాను నిరూపించుకునే పెద్ద రేంజు అవకాశాలేవీ రాకపోవడం సినీకెరీర్ కి మైనస్ అయ్యింది. ఇక ఎన్బీకే 106 సినిమా సామాజిక అంశాలు సహా సంఘంలో దుర్మార్గాల్ని ఎదురించే ఆవేశపరుడైన జెంటిల్మన్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నారట. ఇందులో దిశ ఘటనను తెరపై ఆవిష్కరిస్తారన్న ప్రచారం సాగుతోంది. 

 

అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య సరసన నటించడానికి కీర్తి సురేష్ ని సంప్రదించారట బోయపాటి. కీర్తి కూడా పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే క్లారిటి వస్తుందని అంటున్నారు. ఇక బోయపాటి రష్మీకి ఛాన్సివ్వడానికి ముఖ్య కారణం తనకి నటన విషయంలో అంద్భుతంగా పర్‌ఫార్మ్ చేస్తుందనే కారణం ఒకటైతే ప్రస్తుతం రష్మీకున్న గ్లామర్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ మరోటని తెలుస్తోంది. వామ్మో బోయపాటి రష్మీని సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్ని కారణాలున్నాయా అని ఇప్పుడు ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: