మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరూ అంటే బాలకృష్ణ అనే చెప్తారు.  బాలకృష్ణ తన కెరీర్లో 105 సినిమాలు చేశారు. ఇందులో చాలా వరకు కూడా మాస్ ను మెప్పించే సినిమాలే కావడం విశేషం.  అంతేకాదు, బాలయ్య సినిమాల్లో ఉండే డైలాగులు కూడా అలానే ఉంటాయి.  మాస్ ను టచ్ చేసే డైలాగులు ఎన్నో ఉన్నాయి.  బాలయ్యతో సినిమా అంటే తప్పకుండా అలాంటి డైలాగులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.  


ఇక ప్రస్తుతం బాలయ్య రూలర్ సినిమా చేస్తున్నారు.  రూలర్ అంటే పరిపాలించేవాడు.  దేన్నీ పరిపాలిస్తున్నాడు.. ఇప్పుడు రాజ్యాలు లేవు.  రాచరికాలు లేవు.  ఇప్పుడు పరిపాలించడం అంటే అజమాయిషీ చేయడం అనే అర్ధం కూడా ఉన్నది.  రాజకీయాల్లో ఉండే వ్యక్తులు మాస్ గా ఉంటారు.  అదే విధంగా బిజినెస్ రంగంలో ఉండే వ్యక్తులు క్లాస్ గా ఉంటారు.  సీటు బూటు వేసుకొని టిప్ టాప్ గా ఉంటారు.  వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు.  


ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఉంటారు.  లక్షలాది మంది వారికింద పనిచేస్తుంటారు.  అందుకే బిజినెస్ రంగంలో శాసించే వ్యక్తులు కూడా రాజులే కదా.  రూలర్ అనే దానికి ఎన్ని పదాలైన చెప్పుకోవచ్చు.  ఇక ఇందులో బాలయ్య కార్పొరేట్ వ్యవస్థను శాసించే వ్యక్తిగా ఎదుగుతాడు.. అదే విధంగా నాగలి పట్టి రైతుకు సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఉన్నాడు.  ఇలా రెండు రకాల మనస్తత్వాలను ఈ సినిమాలో చూపిస్తున్నారు.  


దీన్ని చూస్తుంటే.. మహేష్ బాబు మహర్షి సినిమా గుర్తొస్తుంది కదా.  కానీ, ఇందులో ఉండే కంటెంట్ వేరు అందులో ఉండే కంటెంట్ వేరు.  ఈ రూలర్ ఎలా రూల్ చేశాడో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మించాడు.  ఈ సినిమా తరువాత బాలకృష్ణ 106 సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: