ఈ మద్య టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లు మంచి అవకాశాలు దక్కించుకొని సక్సెస్ బాటలో నడుస్తున్నారు.  ఇతర భాష హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్, మాలీవుడ్, కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నారు.  త్రిష, నయనతార, కాజల్, తమన్నా తర్వాత రకూల్, రాశీఖన్నా,సాయి పల్లవి, రష్మిక మందన, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్తు జోరు కొనసాగిస్తున్నారు.  అయితే ఈ మద్య కొంత మంది హీరోయిన్లు మూవీస్ లో కన్నా తమ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. 

 


మరికొంత మంది సీరియర్ హీరోయిన్లు సైతం హాట్ ఫోటో షూట్స్ తో తమ ఇన్స్ స్ట్రాగామ్ లో పోస్ట్ చేస్తూ దర్శక, నిర్మాతలను ఆకర్షిస్తున్నారు. తాజాగా జార్జిరెడ్డి మూవీలో హీరోయిన్ గా నటించిన  యంగ్ బ్యూటీ ముస్కాన్ అద్భుతమైన నటనతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను మెప్పించి ఆకట్టుకుంది.  ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ నాయకుడిగా ప్రభంజనం సృష్టించి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి.. ఉద్యమ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘జార్జిరెడ్డి’ మూవీ తెరకెక్కింది.  మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశారు. 

 


రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీలో నటించిన ముస్కాన్  జార్జి రెడ్డికి ప్రియురాలిగా  నటించింది.  ఈ సినిమా ద్వారా ముస్కాన్  ఫిల్మ్ మేకర్స్ దృష్టిని బాగానే ఆకర్షించింది. కాగా తాజాగా ముస్కాన్ ఇప్పుడు మరొక ఆకర్షణీయమైన గ్లామర్ లుక్ లో మెరిసిపోతుంది. తాజాగా ఈ అమ్మడు  చాలా క్యూట్ గా హాట్ గా ఫోటో షూట్ లో పాల్గొంది వెరీ బోల్డ్ గెటప్ లో సెక్సీ లుక్స్ లో ముస్కాన్ హాట్ నెస్ ను ఫుల్ గా ప్రదరిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా బాగానే హల్ చల్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: