ఇప్పటి వరకు ఏదైనా ఒక సినిమాకి హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలంటే దర్శకనిర్మాతలు సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ కథ కి ఏ హీరోయిన్ సూటవుతుందో దర్శకుడికి క్లారిటి ఉంటుంది. అలాగే బడ్జెట్ పరంగా నిర్మాత కి ఉన్న లిమిటేషన్స్ బట్టి హీరోయిన్ ని ఓకే చేస్తారు. ఇక ఫైనల్ గా హిట్ కాంబినేషన్ అంటే కొన్ని సందర్భాలలో హీరో కూడా ఫలానా అమ్మాయి హీరోయిన్ గా సూటవుతుందని సజెస్ట్ చేస్తుంటాడు. కానీ ఈ మధ్య విచిత్రంగా వరుస సినిమాలతో మాంచి ఊపులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్స్ సజెస్ట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాకి పని చేసినా.. దర్శకనిర్మాతలని, హీరోని డామినేట్ చేస్తూ హీరోయిన్స్ ని సజెస్ట్ చేసేస్తున్నాడట.

 

గత కొన్నాళ్లు గా రొటీన్ ట్యూన్స్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల తన స్టైల్ మార్చుకుని కొత్త పంథా ట్యూన్లతో ఆకట్టుకుంటున్నాడు. కొన్ని బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో తెలుగులో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కారణంగానే తను పనిచేసే ప్రతి సినిమా కు ఏదో ఒక హీరోయిన్ ని సజెస్ట్ చేస్తున్నాడట. సహజంగానే సంగీత దర్శకులతో, సినిమాటోగ్రాఫర్స్ తో హీరోయిన్స్ స్నేహంగా ఉండే యాటిట్యూడ్ కూడా ఇందుకు ముఖ్య కారణమని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఇక హీరోయిన్స్ ని సజెస్ట్ చేయడమే ఎక్స్ట్రా అనుకుంటుంటే వాళ్ళతో పాటలు కూడా పాడించేస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా మాంచి ఫామ్ లో ఉండడం.. మిగతా మ్యూజిక్ డైరెక్టర్ల కు పోటీనిస్తుండడంతో ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉందట పరిస్థితి. ఇక అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సజెస్ట్ చేస్తే సీనియర్ డైరెక్టర్లు దానిని పెద్దగా పట్టించుకోరు కానీ.. కొందరు యంగ్ డైరెక్టర్లు అయితే మొహమాటానికి పోవాల్సి వస్తోందట. అందుకే.. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఎంతమంది హీరోయిన్స్ ని సజెస్ట్ చేస్తాడో.. అంటూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సరే మరి రాను రాను ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫేడవుట్ అయితే అప్పుడు ఈ హీరోయిన్స్ సంగతేమిటి..! 

మరింత సమాచారం తెలుసుకోండి: