టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే కెరీర్ పరంగా తాను దర్శకత్వం వచ్చిన నాలుగు సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో, ఇది కూడా సూపర్ డూపర్ హిట్ కొడుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కూడా వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో విజయాలు అందుకుని ఉండడంతో తప్పకుండా ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి, మహేష్ బాబు తన కెరీర్ పరంగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు మైండ్ బ్లాక్ అనే లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టడంతో పాటు సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి సూర్యుడివో చంద్రుడివో అనే పల్లవితో సాగె రెండవ సాంగ్, రాబోయే సోమవారం రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక సంచలన వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, 

 

ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్ లు అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన సినిమాల్లో డ్యాన్స్ విషయమై పెద్దగా శ్రద్ధ పెట్టని మహేష్ బాబు, ఈ సినిమాలోని సాంగ్స్ లో మంచి డ్యాన్స్  వేశారని, మరీ ముఖ్యంగా మొన్న బయటకు వచ్చిన మైండ్ బ్లాక్ సాంగ్ ని అతి త్వరలో తెరకెక్కించబోతున్నారని, ఆ సాంగ్ లో మాస్ ని మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా పక్కా మాస్ స్టెప్స్ ని డాన్స్ మాస్టర్ శేఖర్ సిద్ధం చేసినట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: