ప్రస్తుతం టాలివుడ్ లో హిట్ జోడిలో ప్రభాస్... అనుష్క ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమా హిట్ అనే అభిప్రాయం కూడా అభిమానుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారని కూడా అంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై ఇద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక సోషల్ మీడియాలో వీరి పెళ్లిపై రోజుకో వార్త వస్తూ ఉంటుంది. వాళ్ళు స్పందించినా సరే... తూతూ మంత్రంగానే ఖండించారు గాని సీరియస్ వ్యాఖ్యలు ఎక్కడా లేవు.

 

అయితే ఇపుడు ఈ ఇద్దరు... సినిమాల నిర్మాణం మీద కలిసి దృష్టి పెట్టె ఆలోచనలో ఉన్నారట. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం యువి క్రియేషన్స్ ఉంది. దీని ద్వారా పలు సినిమాలను ప్రభాస్ ఇప్పటికే నిర్మించాడు కూడా. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి చిన్న సినిమాలపై దృష్టి పెడుతున్నారని తెలిసింది. తమిళంలో ఇప్పుడు చిన్న సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలో అక్కడ చిన్న హీరోలతో కలిసి సినిమాలు చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు.

 

బాహుబలి సినిమా ద్వారా వీళ్ళు తమిళంలో కూడా ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాతో వీళ్లిద్ద‌రు త‌మిళంలో మాత్ర‌మే కాదు దేశ‌వ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమ్స్ హీరో, హీరోయిన్లు అయిపోయారు. అనుష్క తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు ఆ పరిచయాల ద్వారా తమిళం, తెలుగు సినిమాలను కలిసి నిర్మించే ఆలోచనలో ఉన్నారట.

 

అనుష్క ఒక నిర్మాణ సంస్థను మొదలుపెడితే అందులో భాగస్వామిగా ప్రభాస్ ఉంటాడని అంటున్నారు. త్వరలోనే ఒక సినిమా కూడా వీరు మొదలు పెట్టె అవకాశం ఉందని కథ కూడా విన్నారని... హీరో డేట్స్ కొస౦ ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు వీళ్ళ సినిమాలు నిర్మించడం టాలివుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: