విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామా. రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు రీల్ లైఫ్ మీద మామా అల్లుళ్ళుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. మొదటి సారి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

 

నిన్న ఖమ్మం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఉహించినదానికి మించి అభిమానులు ఈ వేడుకకు హాజరై సందడి చేయడం చిత్ర యూనిట్ లో ఉత్సాహం నింపింది. దీంతో వెంకీ మామ విజయంపై వెంకీ మామ టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ప్రీ రిలీజ్ వేదిక పై వెంకీ మామ ట్రైలర్ విడుదల చేశారు.రెండు నిమిషాలకు పైగా గల ట్రైలర్ ని ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో నింపేశారు. 

 

పల్లెటూరిలో మామ అల్లుళ్ళ అల్లరి, సరదాలతో పాటు, చిన్నప్పటి నుండి మామ అల్లుడికి అన్నీ తానై పెంచిన విధానం వంటి ఎమోషన్స్ తో కూడిన కామెడీ ఎలిమెంట్స్ తో దర్శకుడు బాబీ తెరకెక్కించాడని అర్థం అవుతుంది. అయితే ఈ సినిమాలో ఏ అంశం ఎక్కువ ఆకట్టుకుంటుందని విశ్లేషిస్తే ముఖ్యంగా రెండు అంశాలు ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తాయట. మామా అల్లుళ్ళు చేసే అల్లరి వినోదాన్ని పంచుతుందట.

 

అలాగే మామా అలుళ్ళు మూడేళ్ళుగా కలుసుకోకపోవడం, అంత సరదాగా పెరిగిన వారు ఒక్కసారిగా ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. వారెందుకు విడిపోయారన్న టాపిక్ పెద్ద ట్విస్ట్ అని తెలుస్తుంది. వారు విడిపోయాకే చైతూ ఆర్మీకి వెళ్ళాడా, లేదా ప్రేమలో విఫలమయ్యాక ఆర్మీకి వెళ్ళిపోతాడా అనేది కూడా ఆసక్తిగా ఉండనుంది. మొత్తానికి వెంకీ మామా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: