టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  తండ్రికి తగ్గ తనయుడిగా తాతా మనవడు సినిమాలో తన ప్రతిభను చూపించిన బాలకృష్ణ తర్వాత ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.  ఫ్యా క్షన్ పాత్రలకు బాలయ్య పెట్టింది పేరు.   ఆ తరహాలో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ ఎన్నో రికార్డులు సృష్టించింది. బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు నందమూరి నటసింహం. ఈయన నటిస్తున్న రూలర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

 

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ రూలర్‌. కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తున్నావా అంటే లేదు ఫైర్ కే ఫోన్ చేస్తున్నా అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో మొదలైంది.  ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధమైపోతున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ రూలర్ సినిమాపైనే ఉన్నాయి.

 

బాలయ్య మరోసారి రెచ్చిపోయాడు.. మాస్ పోలీస్ ఆఫీసర్‌గా పిచ్చెక్కించాడు. నరుకుడు.. కాల్చుడు.. చంపుడు అన్నీ చూపించాడు కేయస్ రవికుమార్. ఫ్యామిలీ డ్రామాను పండిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రప్ఫాడించాడు బాలయ్య. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ బికినీ అందాలు సినిమాకు బోనస్. పోలీస్ డ్రస్‌తో పాటు పక్కా సాఫ్ట్ అవతారంలో కూడా రెచ్చిపోయాడు బాలయ్య.  మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే బాలయ్య డైలాగ్.. దబిడి దిబిడే అంటున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: