వెంకీ మామా రిలీజ్ కి దగ్గర పడుతోంది. డిసెంబరు పదముడవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవనుంది. మొన్నటి వరకు సంక్రాంతి వద్దామనుకున్న వెంకీ మామా సడెన్ గా తన డెసిషన్ మార్చుకుని డిసెంబరు పదమూడున రాబోతున్నాడు. రిలీజ్ కి చాలా తక్కువ టైమ్ ఉండటంతో ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే నిన్న ఖమ్మం లో ప్రి రిలీజ్ ఈ వెంట్ జరిగింది.

 

చాలా అట్ట హాసంగా జరిగిన ఈ ఈవెంట్ అందరినీ ఆకర్షించింది. దానికి తోడు వెంకటేష్ అల్లరి కూడా ప్రేక్షకుల దృష్టిని తాకింది. ఈ ఈవెంట్ లో  వెంకీ మామా ట్రైలర్ ని ఆవిష్కరించారు. ట్రైలర్  కామెడీ, సెంటిమెంట్ తో అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ఉంది. అయితే ఈ సినిమా కి బడ్జెట్ చాలా ఎక్కువగా అయిందట. ఆ విషయం ట్రైలర్ లో విజువల్స్ ని చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. వెంకీ మామ కోసం పీపుల్స్ మీడియా- డి.సురేష్ బాబు బృందం దాదాపు 40 కోట్ల మేర ఖర్చు చేశారని తెలుస్తోంది.

 

అయితే డిజిటల్ రైట్స్ - శాటిలైట్- హిందీ డబ్బింగ్ వగైరా అన్నీ కలుపుకుని 25కోట్ల వరకూ రాబట్టవచ్చు. ఇక మిగిలిన 15కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో తేవాల్సి ఉంటుంది. పదమూడవ తేది నాడు రిలీజ్ అవుతున్న ఏకైన సినిమా ఇదే కాబట్టి ప్రేక్షకులు సినిమా చూడటానికి ఎక్కువగానే వస్తారు. అదీ గాక ఈ నెలలో పెద్ద సినిమాగా విడుదల అవుతున్న చిత్రం ఇదొక్కటే. అందుకని అప్పటి వరకు సినిమా చుడని వారందరూ థియేటర్ కి వచ్చే అవకాశం ఉంది.

 

కాకపోతే వెంకీ మామాకి కేవలం వారమ్ రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. వారం తర్వాత రూలర్, ప్రతి రోజూ పండగే లాంటి సినిమాలు విడుదల అవుతున్నాయి. కావున థియేటర్లు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల వెంకీ మామా ఎంత సంపాదించినా వారం రోజుల్లోనే కొల్లగొట్టాలి. ఒకవేళ ఈ సినిమా విపరీతంగా నచ్చి, మిగిలిన సినిమాలు అంతంత మాత్రంగా ఉంటే బ్లాక్ బస్టర్ అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: