యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటేనే మాస్‌ డైలాగులు, దుమ్ములేచిపోయే ఫైట్‌ సీన్స్‌, ఎమోష‌న్ సీన్లు, తెర‌నిండా కావాల్సిన భారీ తారాగ‌ణం, అంద‌మైన హీరోయిన్లు, నాటు మోటు స‌ర‌సాలు ఇలా చాలానే ఉంటాయి. మాస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలానే బాల‌య్య సినిమాలు ఉంటాయి. నాటి స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు నుంచి సింహా, లెజెండ్‌ వంటి మాస్‌ సినిమాలతో ఓ ట్రెండ్‌ సృష్టించిన బాలయ్య.. మరోసారి అదే ఊపుతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు.

 

బాల‌య్య హీరోగా కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్‌' ట్రైలర్‌ వచ్చేసింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ ఫంక్తు క‌మ‌ర్షియ‌ల్‌, ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన ర్‌గా తెర‌కెక్కిన‌ట్టు ట్రైల‌ర్ చెప్పేసింది. 2.17 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్లో బాల‌య్య దుమ్మ దులిపేశాడు.

 

కామెడీ, యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, పంచ్ డైలాగ్స్ ఇలా న‌వ‌స‌రాలు మేళ‌వింపుతో ట్రైల‌ర్ ఉంది. బాల‌య్య ఫ్యాన్స్‌కు, మాస్ కు రూల‌ర్ మంచి పండ‌గ లాంటి సినిమా అన్న‌ది క్లియ‌ర్‌గా తెలుస్తోంది. ట్రైల‌ర్లో బాల‌య్య డైలాగులు తూటాల్లా పేలాయి. ప్ర‌తి డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ మూమెంట్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

బాల‌య్య పంచ్ డైలాగులు చూస్తే  ఇది దెబ్బతిన్న సింహాంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది - ధాన్యం తింటున్న మీకే ఇంత పొగరు ఉంటే, పండించిన రైతుకి ఇంకెంత పొగరు ఉంటుందో చూపించమంటావా - వెంటాడి, వేటాడి అంటూ బాల‌య్య చెప్పిన డైలాగులు ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిం చేస్తున్నాయి. ట్రైల‌ర్లోనే ఇన్ని డైలాగులు ఉన్నాయంటే సినిమాలో ఆయన చెప్పే డైలాగ్‌ ఫ్యాన్స్‌ను మరింత విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

 

ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీవ్ర నిరాశను మిగల్చడంతో.. రూలర్‌పై బాలకృష్ణ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సినిమాలో ఆయన గెటప్‌, డ్రస్, డైలాగ్స్‌ను చూస్తే ఇది అర్థమవుతుంది. డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: