నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సి కళ్యాన్ నిర్మిస్తున్న సినిమా రూలర్. బాలయ్య బాబు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న రూలర్ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. తను కుర్ర హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అనేలా బాలకృష్ణ స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. డైలాగ్ చెప్పడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. ఈ సినిమాలో స్టైల్ లో కూడా బాలయ్య బాబు అదరగొట్టాడు.

 

కె.ఎస్ రవికుమార్ తో ఆల్రెడీ జై సింహా సినిమా చేసిన బాలకృష్ణ మరోసారి ఆ దర్శకుడితో రూలర్ చేశాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే బాలయ్య విశ్వరూపం చూపించినట్టు ఉన్నాడు. ముఖ్యంగా మాస్ లుక్ లో బాలకృష్ణను చూసిన ఆడియెన్స్, ఫ్యాన్స్ కు రూలర్ లో కొత్త గా స్టైలిష్ లుక్ తో పాటుగా పోలీస్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు.

 

అయితే ఈ లుక్స్ కోసం బాలయ్య బాబు చాలా హార్డ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 60 ఏళ్ళ వయసులో బాలయ్య బాబు ఇలాంటి సాహసం చేయడం చూస్తుంటే ఆయనకు సినిమా మీద ఎంత ప్రేమో అర్ధమవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు నిరాశపరచగా ఈసారి పక్కా హిట్టు కొట్టాలన్న కసితో చేసిన సినిమా రూలర్. తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు.

 

సినిమాలో హీరోయిన్స్ గా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక కూడా ఇందులో నటిస్తుంది. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న బాలయ్య రూలర్ నందమూరి ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ హంగామా ముందే తెస్తుందేమో చూడాలి. సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: