మనదేశంలో ఉల్లి ధర భగ్గుమంటుంది. దాంతో చాలామంది ఉల్లిగడ్డలు కొనడమే మానేశారు. కొంతమంది మాత్రం ధర ఎంత ఎక్కువ ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేజీ ఉల్లిగడ్డ ధర సుమారు వంద రూపాయలు ఉంటే... తెలంగాణలో నాణ్యతలేని కేజీ ఉల్లిగడ్డల ధరే 90 రూపాయల వరకు ఉంది. దేశ రాజధానిలో మాత్రం కేజీ 165 రూపాయలు ఉంది. ఈ క్రమంలో... సామాజిక మాధ్యమాలలో పెరిగిన ఉల్లిగడ్డల ధరల గురించి అనేక హాస్యాస్పద మెమోలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా... రష్మీ ఉల్లిగడ్డల ధరలు పెరిగినంత మాత్రాన మీరు దిగులు చెందాల్సిన అవసరం ఏమీ లేదంటూ... ఉల్లిగడ్డల ధరలు తగ్గడానికి నా దగ్గర ఒక మంచి చిట్కా ఉందని ఆ టిప్ ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియపరిచారు.

https://mobile.twitter.com/rashmigautam27/status/1203260839760781312

రష్మీ గౌతం ట్వీట్ చేస్తూ... జపాన్ వారికి ఒక సాంప్రదాయం ఉంది... ఆ సాంప్రదాయం ఏంటంటే... ఏదైనా నిత్య సరుకుల ధర మునుపెన్నడు ఎరుగని రీతిలో పెరిగితే... ఆ నిత్యవసర సరుకులను వాడటం పూర్తిగా మానేస్తారు. ఈ విధంగా వాడటం మానేయడం వల్ల... ఆ సరుకుల యొక్క ధర తగ్గుతుంది. మనం కూడా అదే తరహాని అనుసరించి... నెల రోజుల వరకు ఉల్లిగడ్డల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి లేకపోతే కొంచమైనా తగ్గించాలి. ఇలా చేయడం వలన... ధర ఖచ్చితంగా తగ్గుతుంది.' అని పేర్కొన్నారు.

 

https://mobile.twitter.com/rashmigautam27/status/1203261721902608384
ఇంకో ట్వీట్ లో... 'ఈ చిట్కాను అందరికి చెప్పండి. ఈ ఉల్లిపాయల బ్లాక్ మార్కెట్ గాడికి మనము ఇవ్వగలిగిన గిఫ్ట్ ఇదే. ఉల్లిపాయ ధర తగ్గడానికి ఈ మొదటి అడుగు సహాయపడుతుందో చూద్దాం.' అంటూ సలహా ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ ఉల్లిపాయ సలహా సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: