మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరుమీద మోసాలు జరుగుతున్నాయని చాలా మంది హీరోయిన్స్ ఎప్పటికె ఒక దుమారం లేవనెత్తారు. ముఖ్యం గా శ్రీ రెడ్డి వ్యాఖ్యలు అయితే పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.


తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొందరు దర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో మహిళలని లైంగికంగా వేధిస్తున్నారని కొంతమంది హీరోయిన్స్ సంచలనం వాక్యాలు చేసిన విషయం తెలిసిందే. ఇపుడు తాజాగా ఇంకొక హీరోయిన్ కూడా కొన్ని వాక్యాలు చేసింది.  సినిమా ఇండస్ట్రీ లో నాకు గుర్తిపు రాకపోవడానికి, ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి లైంగిక వేధింపులే కారణం అంది.. ఆ హీరోయిన్ మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ ' శక్తి' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన 'మంజరి ఫడ్నిస్ '

 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందని మరొకసారి స్పష్టం చేసింది.
తనకి పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చిందని, కాని దర్శక నిర్మాతలు "ఏ మాత్రం సిగ్గులేకుండా పడుకుంటావా" అని అడిగారని తెలిపింది. కొన్ని సినిమాలకి అవకాశం వచ్చి, అడ్వాన్స్ కూడా ఇచ్చాక, సంతకం కూడా పెట్టాక కొంతమంది దర్శకనిర్మాతలు పడక సుఖం తీర్చాలిసిందిగా కోరారు అని చెప్పింది.

అందువల్ల కొన్ని సినిమాలు వదులుకోవలసి వచ్చింది అని అన్నారు మంజరి.... కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.. అవకాశాలు వచ్చినట్లు వచ్చి చేజారిపోవడం, కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం, ఈ వేధింపుల వల్ల కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు అయినా సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, శుభప్రదం, జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాల్లో నటించింది ఈ మంజరి. 


చిత్ర సీమలో పడక సుఖం అందిస్తేనే సినిమాల్లో ఛాన్సెస్ వస్తాయి అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అందుకే ప్రతిభ ఉన్న హీరోయిన్స్ కూడా చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అన్నారు. సిని దర్శక నిర్మాతలు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారా??? అనే కొత్త ఆలోచన మొదలయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: