ఇండస్ట్రీలో మెగా హీరోలు ఎంతోమంది... ఇక మెగా హీరోలందరికీ   హీరోలందరికీ అభిమానులు కూడా కోట్లల్లో ఉంటారు. అయితే హీరోలకు అభిమానులకు విడదీయరాని సంబంధం ఉంటుంది.  ఇక హీరోలు ఎంత స్టార్ హీరోలు అయినప్పటికీ... ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ... అభిమానులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఒక స్టార్ హీరో గా మారాడు అంటే దానికి కారణం అభిమానులే  కదా. అభిమానులు లేనిదే హీరోలు లేరు... అందుకే అభిమానులకి హీరోలకి మధ్య మాటల్లో చెప్పలేని భాషకందని అనుబంధం ఉంటుంది. అందుకే ఎంత పెద్ద హీరో అయినా సరే కేవలం మీ ప్రేమ అభిమానాలు వల్లే నేను ఇంత స్థాయికి ఎదగగలిగాను  అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. 

 


 ఇక మెగా ఫ్యామిలీ అభిమానుల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు హీరోల కోసం ప్రాణమిచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. అయితే ఇలాంటి అభిమానుల్లోనే ఓ ముఖ్యమైన అభిమాని సంఘం నాయకుడు కన్నుమూసాడు. దీంతో మెగా హీరోలంతా అభిమాని మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మెగా మేనల్లుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో టీజర్ వస్తోంది అని వేచి చూస్తున్న సమయంలో... అటు అభిమానులకు ఇటు మెగా హీరోల అందరికీ ఓ చేదు వార్త అందింది. ఆ వార్త విని మెగా హీరోలు అందరూ విషాదంలో మునిగిపోయారు. 

 


 గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహమ్మద్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం 10 గంటలకు మృతి చెందాడు మెగా అభిమాని నూర్ మహమ్మద్. దీంతో మెగా హీరో టీజర్ రాబోతుంది అని ఆనందంగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు చేదు వార్త విషాదం నింపింది. కాగా మెగా హీరోలందరు  అభిమాని నూర్ మహమ్మద్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మెగా అభిమానుల్లో ముఖ్యమైన అభిమాని అయిన నూర్ మహమ్మద్ మృతి చెందడంతో ఈ రోజు విడుదల చేయాల్సిన అల వైకుంఠపురములో సినిమా టీజర్ కాస్త వాయిదా వేసుకున్నాడు మెగా హీరో అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: