సురేష్ ప్రొడక్షన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.  అన్ని సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి.  ఎన్నో బెస్ట్ హిట్స్ అందుకున్నాయి.  అయితే, సరేష్ ప్రొడక్షన్స్ సంస్థ పెద్ద హీరోలతో సినిమాలు చాలా తక్కువగా చేసింది.  దాదాపుగా దగ్గుబాటి వెంకటేష్ తోనే ఎక్కువగా సినిమాలు చేసింది.  చాలా రోజుల తరువాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించింది.  అదే వెంకిమామ.  ఈ సినిమా డిసెంబర్ 13 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


సినిమా కోసం దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు.  వెంకటేష్ ఎఫ్ 2, నాగచైతన్య మజిలీ సినిమాలతో మంచి ఊపుమీద ఉండటంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థా ధైర్యం చేసి ఈ బడ్జెట్ పెట్టి సినిమా తీసింది.  ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా, మంచి టాక్ వస్తోంది. 


లవ్ యాక్షన్ ఎమోషన్స్ అన్ని ట్రైలర్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాయి.  ఇలాంటి సినిమాలు సంక్రాంతి ఫెస్టివల్ సమయంలో రిలీజ్ చేస్తే   అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.  కానీ, సంక్రాంతి సీజన్ లో సినిమాలు చాలా ఉన్నాయి.  మంచి సినిమా అయినప్పటికీ మిగతా సినిమాల ప్రభావం ఈ సినిమాపై పడుతుంది.  అందుకే సినిమాను డిసెంబర్ కు షిఫ్ట్ చేసుకున్నారు.  మొదట డిసెంబర్ చివర్లో రిలీజ్ చేయాలని అనుకున్నా ... సోలోగా రావాలనే ఉద్దేశ్యంతో పాటుగా వెంకటేష్ పుట్టినరోజు కూడా డిసెంబర్ 13న ఉండటంతో సినిమాను ఆరోజున రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.  


ట్రైలర్ కు మంచి టాక్ వచ్చినా.. సినిమా రిలీజ్ అయ్యి టాక్ వచ్చే వరకు నిర్మాత సురేష్ బాబుకు టెన్షన్ ఉంటుంది.  ఎందుకంటే ఎంతైనా ప్రొడ్యూసర్ కదా.. ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది మరి.  అయితే, ప్రస్తుతం బజ్ మాత్రం సినిమాకు పాజిటివ్ గా ఉన్నది.  ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమాలు వరసగా వస్తూనే ఉండేవి.  కానీ, ఇటీవల కాలంలో ఈ సంఖ్య మరింతగా తగ్గిపోవడం విశేషం.  ఇందులో మామ అల్లుళ్లకు జోడిగా పాయల్, రాశి ఖన్నలు నటిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: