జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అనగానే దర్శక నిర్మాతల్లో ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. ఈ మధ్య హిట్ రేట్ ఎక్కువగా ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ కి మార్కెట్ కూడా భారీగానే పెరిగింది. ఆయనతో సినిమాలు చేయడానికి ప్రముఖ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనకు తగిన కథను సిద్దం చేసుకుని దర్శక నిర్మాతలు... ఆయన డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



తారక్ తో రెండేళ్ళ తర్వాత విడుదల చేసే సినిమా అయినా పర్వాలేదు అంటూ ఎంతగానో ఆయన డేట్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ కూడా తారక్ కి టెంప‌ర్‌, నాన్నకు ప్రేమతో తర్వాత భారీగా పెరిగింది. అప్పటి నుంచి దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. వంద కోట్లకు పైగా తారక్ సినిమాలు వసూలు చేస్తున్నాయి. ఇక ఆ హక్కులు ఈ హక్కులు అంటూ సినిమా విడుదలకు ముందే... భారీగా లాభాలు వచ్చేస్తున్నాయి.



ఒకరకంగా కలెక్షన్లు కాకుండా సినిమా విడుదలకు జరిగే మార్కెట్ లోనే పెట్టుబడి మొత్తం వస్తుంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కరణ్ జోహార్ ని ఆకట్టుకుంది. ఎప్పటి నుంచో తెలుగు హీరోలతో సినిమా చెయ్యాలని చూస్తున్న, కరణ్ జోహార్... ఈసారి తారక్ తో సినిమా చెయ్యాలని పట్టుదలగా ఉన్నాడు. ఇటీవల హైదరాబాద్ కూడా వచ్చి తన వద్ద మంచి కథ ఉందని, మాఫియా నేపథ్యానికి సంబంధించిన కథ అని చెప్పాడ‌ట‌.



ఈ క‌థ‌తో నువ్వు సినిమా చెయ్యాలని, బాలీవుడ్ లో కూడా ఆ సినిమా హక్కులకు సంబంధించి వాటా ఇస్తానని తారక్ తో చెప్పాడట. తమిళంలో కూడా సినిమా విడుదల చేద్దామని చెప్పాడట. అందుకు సంబంధించిన కథ కూడా తారక్ కి వివరించినట్టు తెలుస్తుంది. దీనిపై తారక్ కూడా ఆసక్తి చూపించినట్టు సమాచారం. మరి ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుందో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: