ఆయన ప్రతి మాట వివాదం... ఆయన తీసే ప్రతి సినిమా ఓ సంచలనం... ఆయన ట్విట్లే ఆయన సినిమాకు పబ్లిసిటీ... ఆయనే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. వర్మ  ఏం చేసినా అది పెద్ద వివాదం గా మారిపోతుంది . వర్మ ఏం మాట్లాడిన అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఎప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే అభిమానులు రామ్ గోపాల్ వర్మ నీ వివాదాల దర్శకుడు అని పిలుచుకుంటారు . ఇప్పటికే ఎన్నో సంచలనాత్మక వివాదాస్పద సినిమాలను తెరకెక్కించాడు డైరెక్టర్ వర్మ. ఇక వర్మ సినిమాలు తీసే రూటు కూడా యమ సపరేటు గా ఉంటుంది. మిగతా డైరెక్టర్స్ లా ఏ సినిమా పడితే ఆ సినిమా తీయడు  వర్మ... వర్మ సినిమా తీయాలంటే దానిలో ఓ పెద్ద వివాదం ఉండాల్సిందే. 

 

 

 

 అయితే గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాతో సంచలనం సృష్టించాడు వర్మ. ఆ సినిమాలో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును గట్టిగానే టార్గెట్  చేశాడు. ఇక తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో తెరమీదికి మరో సంచలన సినిమా తీసుకొచ్చాడు. ఈ వివాదాస్పద సినిమాకి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా పై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకుండా రివైంజింగ్ కమిటీకి ఆశ్రయించాలని చెప్పడంతో... ఈ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ చివరికి ఓ మెట్టు దిగి తన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చాడు. ఇక ఆ తర్వాత రివైజింగ్  కమిటీని వర్మ ఆశ్రయించగా ఈ సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

 

 

 

 అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్మ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే వర్మ సినిమా ప్రమోషన్స్ ఎలా చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే కదా. సంచలన ట్వీట్ లు పెడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాకు ప్రచారం చేసినట్టుగానే ఈ సినిమాకు కూడా ప్రచారం మొదలెట్టేశాడు. మరోసారి సినిమా ప్రమోషన్స్ లో తన మార్కు చూపించాడు రాంగోపాల్ వర్మ. గతంలో అందరినీ తన సినిమా పబ్లిసిటీ కోసం వాడిన రామ్ గోపాల్ వర్మ ఈసారి జగన్, విజయసాయి రెడ్డి ని తన సినిమా పబ్లిసిటీ కోసం వాడాడు. ఓ ఫొటోని మార్ఫింగ్ చేసి వర్మ ట్వీట్ చేసాడు. ఈ నెల 12 న అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు సినిమా రిలీజ్ అవుతుండటంతో జగన్మోహన్రెడ్డి విజయసాయిరెడ్డి సంబరాలు చేసుకుంటున్నట్టు ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: