టాలివుడ్ ను దశాబ్ధకాలం తన అందచందాలతో ఏలిన భామ కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీలో సీనియర్ జూనియర్ అనే తేడాలేకుండా హీరోలందరితో జోడీ కట్టిన ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడుకి  సినిమా అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ భామ చేతుల్లో తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.  అదే కమల్ హసన్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2. ఈ సినిమా రావడానికి ఇంకా ఏడాది సమయం పడుతుంది. లేదా అంతకంటే ఎక్కువ సనయం కూడా పట్టవచ్చు.


ప్రస్తుం ఈ అమ్మడుకి వయస్సు మూడుపదులు దాటిపోయింది. ఇంక ఇప్పుడు ప్రతీ ఒక్కరూ అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని.. ఎవరైనా హీరోయిన్‌ని ఈ ప్రశ్నఅడిగితే నాకా అప్పుడే పెళ్లేంటి అంటారు..కాని ఈ అందాలతార మాత్రం తనకు తగిన వాడు దొరిగ్గానే పెళ్లి చేసేసుకుంటానని చెప్తుంది. ఇంట్లో వాళ్లకు కూడా క్లారిటీ ఇచ్చిందట. తాను చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోగానే పెళ్ళి చెసుకుటానని..


కాని ఇప్పటికే ఆ వరుడు దొరికాడని ప్రచారం జరుగుతుంది. ఈమెకు ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి జరగబోతుందని టాలివుడ్ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాను అయితే ప్ర‌స్తుతానికి సింగిల్ అని.. మంచి అబ్బాయి దొరికితే పెళ్లికి సిద్ధ‌మంటూనే చాలా తెలివిగా ఇప్ప‌ట్లో కాదు అంటూ క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసింది. అయితే ఆ బిజినెస్ మ్యాన్ విషయంలోనే ప్రస్తుతం కాజల్ ఇంట్లో వివాదాలు రేగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. కాజల్ పెళ్లి విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.


ఇప్పటికే కాజల్ చెల్లి నిషాకు పెళ్లై.. తల్లి కూడా అయిపోయింది. దాంతో కాజల్‌పై కూడా ఒత్తిడి పెరిగిపోతుంది.  చందమామ బిజినెస్ మ్యాన్‌నే  పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వస్తోంది. అయితే ఆ విషయాన్ని పెళ్లికి కొన్నిరోజుల ముందే బయటపెట్టాలని అమ్మడు సీక్రెట్ గా ఉంచుతున్నట్లు సమాచారం. అన్నీ కుదిర్తే త్వరలోనే బిజినెస్ మ్యాన్‌తో ఏడడుగులు నడుస్తుందని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: