కరెన్సీ కంటే కంఫర్ట్ లెవల్స్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు హీరోయిన్లు. ఒక హీరోతో కంఫర్ట్ గా ఉంటే వాళ్లతో మళ్లీ మళ్లీ సిినిమాలు చేస్తుంటారు. కానీ దీపిక పదుకొనే మాత్రం నో కంఫర్ట్ అంటోంది. భర్తతో కలిసి నటించడం ఇష్టం లేదు అంటోంది. 


రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే కాంబినేషన్ కు బాలీవుడ్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈ కపుల్ కెమిస్ట్రీ అద్భుతమని పొగిడే అభిమానులు కూడా ఉన్నారు. రణ్ వీర్ లా కేరింగ్ తీసుకునే హస్బెండ్ దొరకడం దీపిక అదృష్టమని ఇప్పటికీ కామెంట్ చేస్తుంటారు ముంబై జనాలు. అయితే దీపిక మాత్రం రణ్ వీర్ తో కలిసి నటించేందుకు ఇష్టపడట్లేదు. భర్తతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు నో చెబుతున్న హీరోయిన్. 

 

రణ్ వీర్, దీపిక కాంబినేషన్ లో మూడు సినిమాలొచ్చాయి. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీలో వీళ్ల కెమిస్ట్రీకి సిిల్వర్ స్క్రీన్ కూడా మురిసిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఈ జోడీకి ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని కథలు తీసుకెళ్లారట నిర్మాతలు. కానీ దీపిక మాత్రం కథ ఓకే గానీ రణ్ వీర్ తో కలిసి నటించడం నాట్ ఓకే చెప్పిందట. 

 

భార్యా భర్తల కెమిస్ట్రీ చాలా పర్సనల్. ఆ కెమిస్ట్రీని సిల్వర్ స్క్రీన్ పై చూపించాల్సిన అవసరం లేదని ఫీలవుతోందట దీపిక పదుకొనే. అందుకే సినిమాల్లో కలిసి నటించకూడదని డిసైడ్ అయ్యారట దీప్ వీర్. అయితే ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి 83సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తున్నారు. కాబట్టి ఈ లెక్కలో చూస్తే 83తర్వాత దీపికా పదుకొనే, రణ్ వీర్ కపూర్ కలిసి నటించే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. చూడాలి మరి ముందు ముందు సినిమాల్లో వీళ్లిద్దరి పాత్ర ఎలా ఉండబోతోందో..!

 

 

 



 

 

మరింత సమాచారం తెలుసుకోండి: