సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ జంటకు బాలీవుడ్ లో చాలా ఫాలోయింగ్ ఉంది. వాళ్లను ఇన్ స్పిరేషన్ గా తీసుకునేవాళ్లు బోల్డంత మంది ఉన్నారు. కానీ కరీనా మాత్రం సైఫ్ అంత మంచోడు కాదంటోంది. నైలాన్ తాడులా కనిపించే నాగుపాము అని కంప్లైంట్ చేస్తోంది. 

 

అతడు సినిమాలో మహేశ్ బాబు గురించి త్రిష ఎలా మాట్లాడిందో.. కరీనా కపూర్ కూడా ఇలాగే సైఫ్ అలీఖాన్ గురించి చెబుతోంది. నా భర్త పెద్ద రోమియో అని టీజ్ చేస్తోంది. ఇడియట్, పోకిరి అనే టైటిల్స్ ని ఎవరికైనా అంకితమివ్వాలంటే అందుకు సైఫ్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతోంది కరీనా కపూర్. 

 

సైఫ్ అలీఖాన్ గురించి కరీనా ఇలా మాట్లాడటానికి లవ్ మేటరే కారణం. ఎందుకంటే బెబోని బేబీగా మార్చుకోవడానికి సైఫ్ చాలా అల్లరి పనులు చేశాడట. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ.. అని కరీనా చుట్టూ తిరిగాడట. సినిమా సెట్స్ లోనూ విల్ యూ మారీ మీ అంటూ చాలా డిస్ట్రబ్ చేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మిసెస్ సైఫ్. 

 

తషాస్ షూటింగ్ లో మొదటి సారి కరీనాకు ప్రపోజ్ చేశాడట సైఫ్.  అయితే ఆ ప్రపోజల్ కు నో చెప్పిందట బెబో. అయినా విడిచిపెట్టకుండా లడఖ్ లో మరోసారి పెళ్లి ప్రస్తావన తసుకొచ్చాడని చెప్పింది.  ఇక రెండోసారి కూడా కరీనా కుదరదని తేల్చేసిందట. కానీ సైఫ్ మాత్రం విడిచిపెట్టకుండా కరీనా కపూర్ చుట్టూ తిరిగాడని, రోమియో వేషాలతో మనసు మార్చాడని చెప్పింది కరీన. తర్వాత సైఫ్ ప్రేమలో లాక్ అయిపోయానని నాటి సంగతులు గుర్తు చేసుకుంది  బెబో. మొత్తానికి కరీనా కపూర్ తన భర్త గురించి చెప్పరాని మాటలు చెప్పేసింది.  సైఫ్ చాలా అల్లరోడు.. రోమియో అంటూ గుట్టువిప్పింది. 

 





మరింత సమాచారం తెలుసుకోండి: