ఇటీవల రాయలసీమ పర్యటనలో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ని దారుణంగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మండపేట లో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలతో మరియు నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో అభిమానుల గోల గోల చేయడంతో పవన్ కళ్యాణ్ అసహనం చెందటంతో  ప్రసంగం ఆపేసి గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల నేను ఓడిపోవడానికి కారణం ‘మీరు సరిగ్గా లేకే నేను ఓడిపోయా’ అంటూ అభిమానులపై మరియు జనసేన కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పవర్ స్టార్ పవర్ స్టార్ అని వేదికపై నాయకులు కూడా అనవద్దని సీఎం సీఎం అని కూడా పిలవద్దని నేను సినిమా యాక్టర్ నీ కాదు పొలిటికల్ లీడర్ ని అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మీకు క్రమశిక్షణ ఉండాలని అభిమానులకు పవన్ సూచించారు.

 

ముఖ్యంగా రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తరుణంలో అభిమానులు అరుపులు కేకలు వేయడంతో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా సీరియస్ అయ్యారు. కొంతసేపటికి పవన్ కళ్యాణ్ సైలెంట్ గా జనసేన కోసం మీరు సైనికులే. కానీ మీరు ఇట్లా చేయకూడదు కదా. అరవొద్దు దయచేసి. నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు. క్రమశిక్షణ లేని వారు మీరు ఏం చేయలేరు. మీరు సరిగ్గా లేకపోవడం వల్లే నేను ఓడిపోవల్సి వచ్చింది. అది మర్చిపోకండి. నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు మీతోటి. ఎందుకుంటే మీకు క్రమశిక్షణ లేదు.

 

క్రమశిక్షణ ఉండుంటే జనసేన గెలిచుండేది. ప్రత్యర్థులు, శత్రువులు దెబ్బ కొడతారు. మీకేమో క్రమశిక్షణ లేదు అని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనూ ఫ్యాన్స్ అరుపులు, కేకలు ఆగిపోయాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో రావడం తో దగ్గర ఉన్న అభిమానులను కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా తీట్టడం మంచిది కాదు… ఓడిపోయినా గాని పవన్ వెనుక ఉన్నది అభిమానులే అలాంటి వారిపై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వటం సమంజసం కాదని వీడియో పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: