రజినీకాంత్, మురగదాస్ కాంబినేషన్‌ లో వస్తున్న సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత రజినీ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. సినిమా గురించి ఇటీవల రజినీకాంత్ ఆసక్తికరమై నవిషయాలు బయటపెట్టారు.

 

ఆయన ఏమన్నారంటే.. “ నయనతార ఈ సినిమాలో నాతో న‌టించింది. త‌ను చంద్రముఖిలో తొలిసారి నాతో న‌టించింది. ఈ సినిమాలో చంద్రముఖి కంటే గ్లామర్ గా ఎనర్జిటిక్ గా కనపడుతుంది. అలాగే సునీల్ శెట్టి, యోగిబాబు, నివేదా థామస్ ఇలా అంద‌రూ చాలా మంచి పాత్రలు చేశారు. ఇక సుభాస్కర‌న్ నాకు మంచి స్నేహితుడు. త‌నొక సినిమా నిర్మాత గానే మ‌న‌కు తెలుసు. కానీ తను లండన్ లో పెద్ద బిజినెస్ మేన్. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. స‌మాజానికి సేవ చేస్తున్నాడు. త‌న నిర్మాణంలో శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో నేను 2.0 సినిమా చేసే సమయంలో మా బ్యానర్ లో మరో సినిమా చేయాల‌ని ఆయ‌న‌ నన్ను అడిగాడు నేను సరేనన్నాను.

 

ఈ సినిమాలో నన్ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? అని ఆలోచించినప్పుడు నాకు మురుగ‌దాస్‌గారు ఆలోచ‌న‌లోకి వ‌చ్చారు. ఆయన డైరెక్ట్ చేసిన రమణ, గజినీ చిత్రాలు నాకు బాగా నచ్చాయి అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను ఆయన కూడా సరేనన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా చేయడానికి వీలు కాలేదు. `కబాలి`, `కాలా` సినిమాలు చేసే సమయంలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా చేస్తానన్నాడు మురుగ‌దాస్‌. అయితే `పేట` చిత్రంలో నన్ను చూసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్‌ చేస్తారని తెలిసి ఉంటే నేను అద్భుతమైన సినిమా చేసేవాడిని క‌దా! అని ఒక వారంలోనే `దర్బార్` కథతో నా దగ్గరకు వచ్చాడు.. అంటూ వివరించారు రజినీకాంత్ .

మరింత సమాచారం తెలుసుకోండి: