భారత దేశంలో తన స్టైల్, నటనతో కోట్లమంది ప్రేక్షకులు గుండెల్లో స్థానం సంపాదించారు సూపర్ స్టార్ రజినీకాంత్.  తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ ఇలా పలు భాషల్లో నటించిన ఆయన నటన ఎంతో ప్రత్యేకం...అంతకు మించి ఆయన స్టైల్ అంటే పడి చచ్చే అభిమానులు కోకొల్లలు. అయితే కండెక్టర్ జీవితం నుంచి ప్రపంచ దేశాలను తనవైపు చూసేలా గొప్ప నటుడిగా ఎదగడానికి రజినీకాంత్ ఎన్నో కష్టాలు పడ్డారట.  తాను సినీ పరిశ్రమలో ఎలాంటి ఛేదు అనుభవాలు ఎదుర్కొన్నానో రజినీకాంత్ స్వయంగా తెలిపారు. 16 వయదనిలే సినిమా తర్వాత ఓ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కిస్తానన్నారు. కానీ నేను ఆ సినిమా సెట్స్‌కు వెళ్లేవరకూ నిర్మాత నాకు అడ్వాన్స్ ఇవ్వలేదు.

 

దీంతో నేను అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తానని చెప్పాను. సరే అని ఒప్పుకొని.. ఇంటికి ఆలస్యంగా కారు పంపించారు. ఏవియం స్టూడియో వద్ద షూటింగ్ స్పాట్ కి వెళ్ళగానే ప్రొడక్షన్ మేనేజర్ కలిసి డబ్బు అడిగితే ఇవ్వలేదు. మేకప్ వేసుకోగానే ఇస్తామని అన్నారు.. ఆయన అన్న ప్రకారం అన్నీ సిద్దం చేసుకున్నా అడ్వాన్స్ ఇవ్వక పోగా పట్టించుకోలేదు.  ఒక కాస్ట్లీ కారు నుంచి దిగిన ఒక నిర్మాత నా దగ్గరకు సీరియస్ గా వచ్చారు. ఏంటి? అడ్వాన్స్ డబ్బు ఇవ్వకుంటే నటించానని చెప్పావట! నువ్వేమైనా గొప్ప నటుడిని అనుకుంటున్నావా? అని కోపంగా మాట్లాడారు. అంతే కాదు నీ ముఖానికి సినిమాల్లో నటిస్తావా.. ఇక్కడ నుంచి వెళ్లిపో అని కసురుకున్నారు.  

 

కనీసం కారులోఇంటి వద్ద దించమని అడిగితే.. అది కూడా చేయలేదు.  దాంతో నాలో సినిమాల్లో నటించాలన్న కసి మరింత పెరిగింది..ఎక్కడైతే అవమానింప బడ్డానో అక్కడే నా సత్తా చూపించాలని అనుకున్నాను. ఆ నిర్మాత ప్రవర్తనతో నాకు చాలా బాధ కలిగింది. ఆ సంఘనతో ఏర్పడిన కసితో ఎంతో కష్టపడి రెండున్నరేళ్లలో ఫారిన్ కారు కొన్నానని చెప్పుకొచ్చాడు రజనీ. ఇప్పుడు అందరూ గుర్తించిన హీరోని అయ్యానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: