ఈ వారం విడుదల కాబోతున్న ‘వెంకీ మామ’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. ఇప్పటి వరకు ఎంతోమంది గొప్ప వ్యక్తుల జీవితాల పై బయోపిక్స్ వచ్చినట్లుగా తన రియల్ లైఫ్ లవ్ స్టోరీని త్వరలో సినిమాగా తీయబోతున్న విషయాన్ని బయటపెట్టాడు. 

ఈ రియల్ లవ్ స్టోరీలో తాను సమంతలు కలిసి నటించబోతున్న విషయాలను వివరిస్తూ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను దర్శకుడు బాబి తయారు చేస్తున్న విషయాన్ని వివరించాడు. దీనితో త్వరలో సమంత నాగచైతన్యలు కలిసి   మరో సినిమాలో నటించబోతున్నారు అన్న క్లారిటీ వచ్చింది. 

ఇదే సందర్భంలో చైతన్య ‘వెంకీ మామ’ మూవీలోని తన పాత్ర గురించి కూడ క్లారిటీ ఇచ్చాడు. ఈమూవీ టైటిల్ వెంకటేష్ పాత్ర చుట్టూ తిరిగినా తన పాత్రకు కూడ ఈ మూవీలో చాల ప్రాధాన్యత ఉంటుంది అన్న స్పష్టమైన క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో వెంకీ డామినేషన్ ముందు చైతన్య పాత్ర చిన్నబోయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చైతూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఈ క్లారిటీ ఇచ్చాడు అనుకోవాలి. 

ఇక తన మేనమామలతో తనకు ఉన్న బంధం గురించి మాట్లాడుతూ తనకు ఏ సమస్య వచ్చినా ఏసలహా కావలసి వచ్చినా తాను వెంటనే తన మేనమామల దగ్గరకు వెళ్ళిపోతానని అయితే తన సమస్యలకు వారిచ్చే సలహాలలో తనకు నచ్చిన సలహాలను మాత్రమే స్వీకరించి మిగతా సలహాలను పక్కకు పెట్టేస్తాను అంటూ జోక్ చేసాడు. ఇక ‘వెంకీ మామ’ సినిమాలో తమ ఇద్దరి పాత్రలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుందని ఈ మూవీలో రెండు లవ్ స్టోరీలు ఉంటాయని ముఖ్యంగా ఎమోషన్ ఈ సినిమాను చివరి వరకు నడిపిస్తుంది అంటూ ఈ మూవీలో తాను తన మేనమామతో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేని సంఘటన అని అంటున్నాడు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: