బాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ మద్య కొంత మంది నటులు తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో  డిఫ్రెంట్ రోల్స్‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరుపొందాడు బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ.  బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో సైతం తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ.  మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ నటుడు ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వ‌సేపూర్‌, బ‌ద్‌లాపూర్‌, రామ‌న్ రాఘ‌వ్‌లాంటి మూవీస్‌తో న‌వాజ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రలు చేస్తూ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. అయితే తనను ‘స్టార్‌’ అని మాత్రం పిలవొద్దంటున్నారు.

 

నన్ను సూపర్ స్టార్, మెగాస్టార్ అని పిలవొద్దు అని ఖరాఖండిగా చెప్పాడు.. ఒక్కసారి స్టార్‌ అనే ఛట్రంలో ఇరుక్కుపోతే విభిన్నమైన పాత్రలు చేయలేం. నటులు అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటారు. అందుకే నన్ను స్టార్‌ అని పిలవొద్దు అంటూ నిర్మోహమాటంగా అంటాడు నవాజుద్దీన్ సిద్దికి.  తాజాగా  నవాజుద్దీన్‌ సిద్ధిఖీ  ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ (26) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె శనివారం నాడు మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబసభ్యులు తెలిపారు.

 

కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా... చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. ఆనాటి నుంచి ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపాడు.  

 

స్యామా అంత్యక్రియలు సిద్ధిఖీ కుటుంబ స్వగ్రామమైన బుధానా (ఉత్తరప్రదేశ్)లో ఆదివారం నాడు నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం 'సేక్రెడ్ గేమ్స్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. చెల్లెలి మరణ వార్త వినగానే అమెరికాను నుంచి ఇండియాకు హుటాహుటిన వచ్చినట్లు  సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: