'నాపేరు సూర్య' దారుణంగా డిజాస్టర్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా టైమ్ తీసుకుని సినిమాలు ఏవి చేయకుండా చాలా కథలు విని నెక్స్ట్ చేయబోయే సినిమా ఎలాగైనా హిట్టు పడాలని మళ్లీ హిట్ ట్రాక్ కాలనీ చివరాకరికి తన కెరియర్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అలా వైకుంఠపురం లో సినిమా ఓకే చేయడం జరిగింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతున్న తరుణంలో అల్లు అర్జున్ అభిమానులు ‘అలా వైకుంఠపురం లో’ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు. ఇదే తరుణంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కూడా ‘అలా వైకుంఠపురం లో’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని అన్ని విధాలా అన్ని ఫార్మాట్ల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

 

ముఖ్యంగా సినిమా లో డాన్స్ అదరగొట్టే రీతిలో అల్లు అర్జున్ స్టెప్పులు వేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్స్ అభిమానులను ఎంతగానో అలరించే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో రికార్డుల మీద రికార్డు సృష్టించడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

 

దీంతో సినిమాపై హైప్ ఎక్కువగా ఉండటంతో రికార్డు స్థాయిలో అలా వైకుంఠపురం లో సినిమాకి సంబంధించి డిజిటల్ సాటిలైట్ రైట్స్ ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట నెట్‌ప్లిక్స్‌కు అమ్మినట్టు వార్తలొచ్చినా, సన్ నుంచి భారీ అమౌంట్ ఆఫర్ రావడంతో మూవీ టీం అటువైపు మొగ్గు చూపిందట. దీనికి సంబంధించి డీల్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: