టాలీవుడ్ లో తనదైన అందం, అభినయంతో స్థానం సంపాదించుకుంది రాశిఖన్నా. తెలుగు సినిమాల్లో సొలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసింది. కాకపోతే అమ్మడికి అదృష్టం కాస్త దూరంలోనే ఉండిపోతుంది. న్యూ జనరేషన్ హీరోలతో వచ్చినన్ని అవకాశాలు స్టార్ హీరోలతో దక్కించుకోలేక పోయింది. ఎన్టీఆర్ తప్పితే మరే స్టార్ హీరో పక్కన కూడా అవకాశాలు దక్కలేదు ఈ ఢిల్లీ బ్యూటీకి. ప్రస్తుతం రాశి నటించిన రెండు సినిమాలు వారం రోజుల తేడాతో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాల ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతోంది.

 

 

వెంకటేశ్ - నాగ చైతన్య కాంబోలో వస్తున్న వెంకీ మామలో చైతూకు జోడీగా, సాయి ధరమ్ తేజ్ సినిమా ప్రతిరోజు పండుగే లో సోలో హీరోయిన్ గా తాన స్టార్ డమ్ ను పరీక్షించుకోబోతోంది. గతేడాది వచ్చిన గీత గోవిందం సినిమానే చేజేతులా మిస్ చేసుకుంది రాశి. ఆ సినిమా చేసిన రష్మిక మహేశ్ బన్నీల పక్కన అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకి మంచి టాక్ వస్తే రాశి అదృష్టం పండినట్టే. రిలీజ్ దగ్గర పడుతూండటంతో రెండు సినిమాల ప్రమోషన్ల వేగం పెంచారు మేకర్స్. దీంతో రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బిజీగా వుంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి అయినా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రాశి ఖన్నాకు ప్లస్ మార్కులు పడతాయి. 

 

 

ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా.. టాప్ హీరోల పక్కన హీరోయిన్ గా చేయకపోయినా.. ఇంకా లైమ్ లైట్ లో ఉందంటే అది రాశి అదృష్టమనే చెప్పాలి. రాశికి టాలెంట్ లేకపోయుంటే ఈసరికి వెళ్లిపోయేదే. కానీ.. ముందే చెప్పినట్టు అదృష్టం అడుగు దూరంలో ఉండిపోతుంది. కాబట్టి ప్రస్తుత సీజన్ రాశీ చేతుల్లో ఉంది. కాబట్టి రాశికి కాస్త వాసి తోడయితే వచ్చే ఏడాది స్టార్ హీరోల సినిమాలు దక్కించుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: