సీనియర్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ మరియు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం 'వెంకీమామ'. యువ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ఆర్ఎక్స్ 100 బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగ చైతన్య తో రాశికన్నా రొమాన్స్ చేయనుంది. ఒకవైపు పల్లెటూరి నేపధ్యం మరొక వైపు ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వినోదం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం అంతా తెలిపారు.

 


ఇక సినిమా విషయానికి వస్తే వెంకటేష్ మరియు నాగ చైతన్య నిజ జీవితంలో లాగానే ఇక్కడ కూడా మామ అల్లుళ్ల లాగానే నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మొదటి నుంచి సన్నిహితంగా కలిసిమెలిసి ఉండే వీరిద్దరి మధ్య గొడవ రానుందని కథ లోని ఒక చిన్న అంశం లీక్ అయింది .దాని తర్వాత నాగచైతన్య తన విధుల ను నిర్వహించడానికి ఆర్మీ కి వెళ్లిపోవడం... అక్కడ నాగచైతన్య ప్రమాదంలో ఉండగా వెంకటేష్ తమ మధ్య గొడవ మర్చిపోయి నాగచైతన్యకు సహాయం చేసేందుకు ఆర్మీ కి వెళ్లడం అక్కడ మామా అల్లుళ్లు కలిసి ఎదుర్కొనే ఇబ్బందులు మొత్తం కలిసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందట.

 


ఇక మామా అల్లుళ్ళ మధ్య జరగబోయే ఈ గొడవ విషయం ఎంత మాత్రం నిజమో తెలియదు కానీ ఈ చిత్రం యొక్క ట్రైలర్ చూస్తే మాత్రం అందులో వెంకటేష్ మరియు నాగచైతన్య మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. టైటిల్ లో వెంకీ మామ అని పూర్తిగా వెంకటేష్ మీదనే సినిమా ఆధారపడకుండా హీరోయిన్లకు కూడా ఈ చిత్రంలో ప్రాముఖ్యత ఉందని నాగచైతన్య మరియు వెంకటేష్ మధ్య తెరకెక్కిన ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: