సూపర్ స్టార్ రజనీకాంత్- ఏ.ఆర్ మురగదాస్ కాంబినేషన్ లో దర్బార్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై తమిలనాట భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు అంచనాల్ని పెంచాయి. ఈ ద్వయం ఎలాంటి కథాంశంతో రాబోతున్నారు అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా చెన్నయ్ లో జరిగిన దర్బార్ ఆడియో వేడుక లో దర్శకుడు మురగదాస్ సూపర్ స్టార్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నాకు ఊహ తెలిసి మా ఊరి థియేటర్ లో చూసిన సినిమా రజనీకాంత్ గారిదే. ఇప్పుడు ఆయన తో నేను సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయన మనకు దేవుడిచ్చిన వరం. దేవుడిని నమ్మిన వాడు కష్టపడతాడు. నిజాయితీగా ఉంటాడు అని నమ్మే వారిలో ఆయన ఒకరు. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన జీవితమే ఓ పెద్ద నౌక. ఆ నౌకలో నాది ఏడాది జర్నీ. ఇది నాకెంతో గర్వకారణం. ఇలాంటి అవకాశం మళ్లీ రావాలని కోరుకుంటున్నా. గత 15 ఏళ్లలో రజనీకాంత్ గారిని ప్రేక్షకులు చూడనవి విధంగా యాక్షన్ సన్నివేశాలుంటాయన్నారు. ఇది ఓ సస్పెన్స్ థ్రిల్లర్. అన్నీ అంశాలున్న చిత్రమని అన్నారు. దర్బార్ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. తెలుగు నాట సరైన ప్రమోషన్ లేకపోవడం రజనీ అభిమానులకు నిరాశనే మిగులుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ ``సుభాస్కరన్ నాకు మంచి స్నేహితుడు. తనొక సినిమా ప్రొడ్యైసర్‌గానే మనకు తెలుసు. కానీ తను లండన్ లో పెద్ద బిజినెస్ మేన్. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. సమాజానికి సేవ చేస్తున్నాడు. తన నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో నేను 2.0 సినిమా చేసే సమయంలో మా బ్యానర్ లో మరో సినిమా చేయాలని ఆయన నన్ను అడిగాడు నేను సరేనన్నాను. ఈ సినిమాలో నన్ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? అని ఆలోచించినప్పుడు నాకు మురుగదాస్‌గారు ఆలోచనలోకి వచ్చారు. ఆయన డైరెక్ట్ చేసిన రమణ, గజినీ చిత్రాలు నాకు బాగా నచ్చాయి అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను ఆయన కూడా సరేనన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా చేయడానికి వీలు కాలేదు. `కబాలి`, `కాలా` సినిమాలు చేసే సమయంలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా చేస్తానన్నాడు మురుగదాస్. అయితే `పేట` చిత్రంలో నన్ను చూసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారని తెలిసి ఉంటే నేను అద్భుతమైన సినిమా చేసేవాడిని కదా! అని ఒక వారంలోనే `దర్బార్` కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ఈ సినిమా ప్రారంభమైందీ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది. చాలా రోజుల తర్వాత శంకర్‌లా ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసే దర్శకుడు మురుగదాస్‌తో పనిచేయం ఆనందంగా అనిపించింది.