తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోలుగా ఉన్న విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ మూడు ద‌శాబ్దాల‌కు పైగా సినిమాలు తీస్తున్నారు. ఇక వీరిద్ద‌రు గ‌తంలో ప‌లుసార్లు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ సినిమాల‌తో పోటీ ప‌డ్డారు. ఇప్ప‌టికే వీరు 11 సినిమాల‌తో ఒకేసారి పోటీ ప‌డ‌గా.. ఇప్పుడు వెంకీ మామ‌, రూల‌ర్ సినిమాలో 12వ సారి పోటీ ప‌డుతున్నారు. వెంకీ మామ ఈ నెల 13న వ‌స్తుంటే.. ఆ మ‌రుస‌టి వార‌మే బాల‌య్య రూల‌ర్ వ‌స్తోంది.

 

వీరిద్ద‌రు మొదటిసారిగా వీరిద్దరు 1986లో పోటీ పడ్డారు. అప్పుడే బాల‌య్య దేశోద్ధారుకుడు, వెంక‌టేష్ తొలి సినిమా కలియుగ పాండవులు వ‌చ్చాయి. రెండు హిట్ అయ్యాయి. ఆ త‌ర్వాత వెంకీ అజేయుడు, బాల‌య్య ప్రెసిడెంట్ గారి అబ్బాయి రెండు ప్లాప్ అయ్యాయి. ఆ త‌ర్వాత బాలయ్య మువ్వగోపాలుడు, వెంకీ భారతంలో అర్జునుడు, త్రిమూర్తులు వ‌చ్చాయి. అప్పుడు వెంకీ సినిమాలు రెండు ఒకే రోజు వ‌చ్చాయి. బాల‌య్య హిట్ కొడితే వెంకీ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

 

వెంకటేష్ ర‌క్త తిలకం, బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ యావ‌రేజ్ అయ్యాయి. బాలయ్య అశోక చక్రవర్తి యావ‌రేజ్ అయితే, వెంకటేష్ ధృవ నక్షత్రం హిట్ అయ్యింది. ఇక 1990లో బాలయ్య నారీ నారీ నడుమ మురారి హిట్ అయితే వెంకీ అగ్గిరాముడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. 1996లో బాల‌య్య వంశానికొక్కడుతో సూపర్ హిట్ కొట్టగా, వెంకీ ధర్మచక్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఆ త‌ర్వాత బాల‌య్య శ్రీకృష్ణార్జున విజయం ఫ్లాప్ కాగా, వెంకీ ఇంట్లో ఇల్లాలు ప్రియురాలు భారీ హిట్ వచ్చింది.

 

2000లో బాల‌య్య వంశోద్ధార‌కుడు ప్లాప్‌.. వెంకీ క‌లిసుందారం సూప‌ర్ హిట్ - 2001 సంక్రాంతికి బాల‌య్య న‌ర‌సింహానాయుడు బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. వెంకీ దేవిపుత్రుడు ప్లాప్ - మొన్న 2019 సంక్రాంతికి బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ కాగా, వెంకీ ఎఫ్2 సూప‌ర్ హిట్‌. ఇలా 10 సార్లు బాక్సాఫీస్ ర‌ణ‌రంగంలో పోటీ ప‌డ్డ వీరిద్ద‌రు ఇప్పుడు 11వ సారి పోటీ ప‌డుతున్నారు. ఈ సంక్రాంతికి బాల‌య్య‌పై చేయి సాధించిన వెంకీ ఇప్పుడు ఏం చేస్తాడో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: