సంక్రాంతికి రాబోయే భారీ సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ మధ్య ఎలాంటి పోటీ ఉందో ముందు నుంచి చూస్తున్నాం. ముందు బన్నీ సినిమా డేట్ ఇస్తే.. కాసేపటికే అదే తేదీకి తమ సినిమా రిలీజ్ అంటూ మహేష్ మూవీ డేట్ ప్రకటించారు. ఇక అప్పట్నుంచి ఈ పోటీ.. గిచ్చుడు కొనసాగుతూ ఉంది. ప్రమోషన్లలో ఎవరి స్టయిల్ వాళ్లు ఫాలో అవుతున్నారు.

 

అవతలి వాళ్లపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇరు చిత్రాల నిర్మాతల మధ్య ఓ అండర్‌స్టాండింగ్ వచ్చి రిలీజ్ డేట్లు సర్దుబాటు చేసుకున్నారని.. ‘సరిలేరు’ డేట్‌ను ఒక రోజు ముందుకు జరిపారని ఈ మధ్యే అప్ డేట్ వచ్చింది. కానీ ఇప్పటికీ ‘సరిలేరు..’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

 

ఈ లోపు టీజర్లో ‘బేరాల్లేవమ్మా’ అంటూ మహేష్ పలికిన డైలాగ్ చర్చనీయాంశం అయింది. బన్నీ సినిమా టీంకు ఇది హెచ్చరిక అంటూ ప్రచారం జరిగింది. అలాగే ‘మైండ్ బ్లాంక్’ పాటలో ఒక చోట కేక్ ప్రస్తావన తేవడాన్ని బన్నీ అభిమానులు ఇంకో రకంగా చూశారు.

 

ఆ మధ్య బన్నీ అభిమానులతో కలిసి కేక్ కట్ చేయడం.. ఆ తర్వాత దాని కోసం ఫ్యాన్స్ ఎగబడటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అప్పట్నుంచి బన్నీ అభిమానుల్ని యాంటీస్ కేక్ అనే పదం వాడి ఏడిపిస్తున్నారు. ‘మైండ్ బ్లాంక్’ పాటలో కేక్ అనే పదం బన్నీ అభిమానుల్ని గిచ్చేందుకే పెట్టారంటూ ఈ పాట రిలీజైనపుడు ఒక చర్చ నడిచింది.

 

ఇదిలా ఉంటే.. సరిగ్గా ‘మైండ్ బ్లాంక్’ పాట రిలీజైన సమయానికే ‘అల వైకుంఠపురములో’లోని సామజవరగమన పాట ఫ్యాన్ వెర్షన్ ఒకటి రిలీజ్ చేసి దాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఇక ఈ రోజు ‘సరిలేరు’ నుంచి రెండో పాట వస్తుంటే.. ఇప్పుడే టీజర్ అప్ డేట్ ఇచ్చారు.

 

సాయంత్రానికి టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది కచ్చితంగా మహేష్ సినిమా పాట ట్రెండ్ కాకుండా చేయడానికే అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ పరస్పర గిచ్చుడు సినిమా రిలీజ్ వరకు.. ఆ తర్వాత కూడా కొనసాగేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: