టక్కర్ సినిమా లో హీరో ఎవరు అనుకుంటున్నారా ? ఇంకెవరు పరిచయం అవసరం లేని హీరో" సిద్దార్ద్ ".. బాయ్స్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టి, బొమ్మరిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు... నువ్వు వస్తానంటే నేను వద్దంటానా తో ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు..

కొన్నేళ్లు వరసగా సినిమాలు చేసాడు.. ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్, బావ, అనగనగ ఒక ధీరుడు ఇలా కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు చేసాడు. కానీ కొంతకాలం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వెనుకపడ్డాడు. తీసిన అన్ని సినిమాలు పెద్దగా  హిట్ అవ్వలేదు అలాగే గుర్తింపు కూడా రాలేదు.

తర్వాత తమిళ ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు.. అక్కడ బానే సినిమాలు విజయవంతమవుతున్నాయి.. తమిళంలో బాగానే రాణిస్తున్నాడు. తెలుగులో సిద్దార్ద్ నటించిన  చివరి సినిమా గృహం. కాని ఈ మూవీ కూడా అంతలా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
ప్రేక్షకులు కూడా సిద్దార్ద్ ని మరిచిపోయారు.

 


ఇప్పుడు తాజాగా ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఒక వెరైటీ టైటిల్ తో, విభిన్న పాత్రతో ఉంటుందట. మూవీ పేరు" టక్కర్ "దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం  ఫిబ్రవరి లో మూవీ రిలీజ్ డేట్ ఉండొచ్చు.


ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మూవీ కి "మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ "ప్రచారం చేస్తున్నారు. మూవీ పోస్టర్ అండ్ ఫస్టు లుక్ ని మెగా ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేసారు. ఇలా మెగా ప్రిన్స్ ప్రచారం వల్ల  సినిమాకి మంచి ప్రచారం వచ్చింది. తెలుగు మరియి తమిళంలో ఒకేసారి మూవీ రిలీజ్ అయిదట.. వరుణ్ తేజ్ చిత్ర  బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టక్కర్ మూవీ తో అన్న సిద్దార్ద్ విజయం సాధించి ప్రేక్షకుల గుర్తింపు సాదిస్తాడేమో  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: