టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా అత్యంత భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఒలీవియా మోరిస్, మరియు రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 

ఇక ఈ సినిమా లో నటిస్తున్న విలన్స్ పాత్రధారులను కూడా ఇటీవల రివీల్ చేసింది సినిమా యూనిట్. కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాకు వి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూరుస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టే విషయమై నేడు ఒక వార్త ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దానిని బట్టి ఈ సినిమా రాబోయే సంక్రాంతి సమయానికి పూర్తి చేయనున్నారని, ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు హీరోయిన్ ఒలీవియా పై కీలక సీన్స్ ని తీస్తున్నారని సమాచారం. 

 

మరికోదిరోజుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పై మిగిలి ఉన్న సన్నివేశాల చిత్రీకరణతో సినిమా మొత్తం పూర్తి అవుతుందని, దానితో సరిగ్గా సినిమా మొత్తం పూర్తి అవుతుందని, ఇదంతా పూర్తి అవడానికి యూనిట్, తమ సంక్రాంతి పండుగ సెలెబ్రేషన్స్ ని కూడా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దాని తరువాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెడతారని, అలానే అనుకున్న విధంగా మొత్తం పది భాషల్లో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయం అని అంటున్నారు. కాగా ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: