పెళ్లిచూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారి తొలిసినిమా తోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ. నిజానికి అంతక ముందు పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండను యువ దర్శకుడు తరుణ్ భాస్కర్, పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మార్చారు. అయితే ఫస్ట్ సినిమా అందించిన సక్సెస్ తో కొంత తడబడ్డ విజయ్, ఆ తరువాత ద్వారక అనే సినిమాలో నటించగా అది పెద్ద ఫ్లాప్ అయింది. ఇక ఆ తరువాత కొంత విభిన్నంగా అలోచించి, యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి అనే బోల్డ్ సినిమాలో నటించాడు.

 

కాగా ఆ సినిమా తొలిరోజు తొలిషో నుండే సూపర్ హిట్ టాక్ తో అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు విజయ్ ని టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ ని చేసాయి. ఇక దాని తరువాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ నటించిన గీతా గోవిందం సినిమా అంతకు మించి మరింత అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో విజయ్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు. అయితే ఇటీవల వరుసగా పెద్దగా సక్సెస్ లు లేక సతమతం అవుతున్న విజయ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. కాగా అతడు ఇటీవల ఒక ప్రముఖ షో కోసం బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ కి చెందిన పలువురు అగ్రనటులతో కలిసి ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

 

అప్పటికే విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా, షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రూపొంది బాలీవుడ్ లో హిట్ అయి మంచి పేరు సంపాదించింది. 
ఆ విధంగా విజయ్ కి అక్కడి ప్రేక్షకుల దృష్టిలో మంచి పేరుంది. ఇక మొన్నటి ఇంటర్వ్యూ  తరువాత అక్కడి ప్రేక్షకుల్లో విజయ్ పేరు మరింతగా మారుమ్రోగుతోందట. అదీకాక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మరియు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్ ఇద్దరూ కూడా తమకు విజయ్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పడంతో అతడి క్రేజ్ ని చూసి అక్కడి బడా స్టార్స్ సైతం భయపడిపోతున్నారట. అలానే కరణ్ జోహార్ వంటి దిగ్గజ దర్శకులే విజయ్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారని కూడా సమాచారం. దానిని బట్టి విజయ్ క్రేజ్ మనం అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: