‘సూర్యుడివో చంద్రుడివో' అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ లోని పాటని కూడా నిన్న సోమవారం సెంటిమెంట్ ను కొనసాగిస్తూ విడుదలయిన కొద్ది సేపటికే ఈ పాటకు కూడ  చార్ట్‌ బస్టర్‌ అయ్యే లక్షణాలు లేవు అని వస్తున్న కామెంట్స్ ఈ మూవీ బయ్యర్లను కలవర పెడుతున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్‌ సాంగ్‌ ని చాలాకాలం క్రితమే విడుదల చేసారు. 

ఆ తర్వాత ఈ మధ్యనే 'మైండ్‌ బ్లాక్‌' సాంగ్ ను విడుదల చేసినా ఆ పాటకు ఊహించిన స్థాయిలో స్పందన కరువైంది. దీనితో నిన్న విడుదలైన ‘సూర్యుడువో చంద్రుడువో’ సాంగ్ తో ఈ మూవీ మ్యానియా మరింత పెరుగుతుందని ఆశించారు. అయితే ఈ పాటకు కూడ మిశ్రమ స్పందన మొదలైంది. 'సూర్యుడివో..చంద్రుడివో..ఆ ఇద్దరి కలయికవో' అంటూ హీరో ఎలివేషన్ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి ఎంతో కష్టపడి రచించిన నేపధ్యంలో వెరైటీ కోసం బి. ప్రాక్ తో పాడించారు. పాటలో చరణం ఎత్తుగడతో పాటు మెలోడీ ట్యూన్ తో ఈ పాత వినసొంపుగా ఉన్నా ఎక్కడో ట్యూన్ సొగసు లోపించి క్యాచీగా లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

...గుండెలోతులో గాయం..నువ్వు తాకితే మాయం..మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సాయం''...''..దేవుడెక్కడో లేడు..వేరే కొత్తగా రాడు..మంచి మనుషులలో గొప్ప మనసు తానై వుంటాడు నీలా...''అన్న మంచి ఉదాత్తమైన పదాలతో రాయబడ్డ ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ విషయంలో పూర్తి న్యాయం చేయలేదు అన్న విమర్శలు వస్తున్నాయి. 


ఈ పాటలో కొత్త ఇనుస్ట్రుమెంటేషన్వినిపిస్తున్నా మెలోడీ టచ్ ఇచ్చినా ట్యూన్ దగ్గరకు వచ్చే సరికి  క్యాచీనెస్ తగ్గి ఈ పాట ఎక్కువ కాలం గుర్తుండిపోయే పాటల లిస్టులో చేరదు అన్న విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. దీనితో మహేష్ రెండవ సోమ వారం వ్రత ఫలితం కూడ పెద్దగా కలిసి రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: