కోలీవుడ్ స్టార్‌హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ రీసెంట్‌గా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బిగిల్ (తెలుగులో విజిల్‌) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో రజినీకాంత్, ప్రభాస్ తర్వాత వరసగా మూడుసార్లు 200 కోట్లు సాధించిన హీరోగా చరిత్ర సృష్టించాడు విజయ్. ఇక ఈ సినిమాతో హిట్ కొట్టిన విజ‌య్ ఇప్పుడు త‌న నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సారి విజ‌య్ ఓ అదిరిపోయే కాంబినేష‌న్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఖైదీతో ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్న లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ నెక్ట్స్ సినిమా తెర‌కెక్కనుంది. 

 

సినిమా త‌ర్వాత విజ‌య్ క్రేజీ డైరెక్ట‌ర్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. శంక‌ర్ విజ‌య్ కోసం ఓ అదిరిపోయే స్క్రిఫ్ట్ రెడీ చేసిన‌ట్టు కోలీవుడ్ సినిమా స‌ర్కిల్స్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. శంక‌ర్ రోబో 2.0 సినిమా త‌ర్వాత ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్‌తో భార‌తీయుడు 2 సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే శంక‌ర్ - విజ‌య్ కాంబోలో వ‌చ్చే సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని తెలుస్తోంది.

 

ఇక గ‌తంలో శంక‌ర్ - విజ‌య్ కాంబినేష‌న్‌లో బాలీవుడ్ హిట్ మూవీ 3 ఇడియ‌ట్స్ రీమేక్ వ‌చ్చింది. ఆ సినిమా తెలుగులో స్నేహితుడు పేరుతో రిలీజ్ అయ్యింది. అప్ప‌ట్లో ఆ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేద‌న్న‌ది వాస్త‌వం. అయితే ఆ సినిమాలో విజ‌య్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు జీవా, శ్రీరామ్ హీరోలు కూడా న‌టించారు. ఇక విజ‌య్ ఫ్యాన్స్ మాత్రం త‌మ హీరోతో శంక‌ర్ ఎప్పుడు సినిమా చేస్తారా ? అని కొద్ది రోజులుగా వెయిటింగ్‌లో ఉన్నారు.

 

ఇక ఇప్పుడు మ‌ళ్లీ సోలోగా వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా అంటే మామూలుగా అంచ‌నాలు ఉండ‌వు. ఇప్ప‌టికే శంక‌ర్ - విజ‌య్ మ‌ధ్య ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి చ‌ర్చ‌లు కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: