వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  డిసెంబర్ 12 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ట్రైలర్ తో పిచ్చెక్కించిన వర్మ అసలు సినిమాలో సినిమాలో ఏం చూపించబోతున్నారు  అనే విషయాలు తెలుసుకోవాలి.  వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో విజయవాడ రాజకీయాలకు చూపించబోతున్నారు.  


విజయవాడలో  జరుగుతున్నా ప్రతి విషయాన్ని వర్మ తన సినిమాలో చూపించబోతున్నాడు.  9/11, రక్త చరిత్ర సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు.  ఆ తరువాత తీసిన కిల్లర్ వీరప్పన్ మూవీ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది.  అదే విధంగా ఈ సినిమా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమా తరువాత వర్మ దర్శకత్వం వహిస్తున్న ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమా రిలీజ్ కాబోతున్నది.  


ఈ సినిమాను ఇండో.. చైనా కొలాబరేషన్లో వర్మ దర్శకత్వంలో తెరక్కింది.  ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.  బ్రూస్ పుట్టిన గ్రామంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  ప్రస్తుతం వర్మ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.  ఒకవైపు విజయవాడ రాజకీయం ఆధారంగా తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను రిలీజ్ బిజీగా ఉంటూనే తన మరో సినిమా రిలీజ్ కు సిద్ధం చేసుకుంటున్నాడు.  


సినిమా రిలీజ్ కు ముందు వర్మ చేసిన కొన్ని పనుల కారణంగా మరోసారి వివాదంలో చిక్కుకుంది.  కెఏ పాల్ వద్ద నుంచి సెన్సార్ సర్టిఫికెట్ తీసుకుంటున్నట్టుగా ఫోటోను మార్ఫింగ్ చేసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీనిపై కెఏ పాల్ కోడలు కేసు పెట్టింది.  సైబర్ క్రైమ్ కేసు నడుస్తోంది.  ఒకవైపు సినిమా రిలీజ్, మరోవైపు ప్రమోషన్ సమయంలో వర్మ చేసిన పని వలన సైబర్ క్రైమ్ కేసు.  ఆహా వర్మ అంటే ఇదే మరి.  చుట్టూ వివాదాలు ఉంటేనే అయన ప్రశాంతంగా నిద్రపోతాడు అనుకుంటా. 

మరింత సమాచారం తెలుసుకోండి: