ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వారివే కాకుండా చరిత్రలో ప్రాచుర్యం సంపాదించిన గొప్ప వీరుల జీవిత గాధలను బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు.   ఇక్కడే కొన్ని చిక్కులు వచ్చి పడుతున్నారు.. చరిత్ర కారుల జీవిత కథ యథాతదంగా కాకుండా వక్రీకరిస్తున్నారని.. కమర్షియల్ రంగు పులుముతున్నారని దాని వల్ల వారి చరిత్రకు భంగం వాటిల్లుతుందని కొన్ని వర్గాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కించిన ‘పద్మావత్’ పెను సంచలనాలు సృష్టించింది.

 

 ఆ తర్వాత కంగనా రౌనత్ ముఖ్య భూమిక పోషించిన ‘మణికర్ణిక’ పై ఎన్నో వివాదాలు వచ్చాయి. జోదా అక్బర్​, బాజీరావు మస్తానీ సినిమాలపై చాలా గొడవ నడిచింది.  తాజాగా అర్జున్ కపూర్, సంజయ్‌దత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం పానిపట్. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే  పానిపట్ సినిమాపై జాట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జాట్ చక్రవర్తిగా పేరొందిన మహారాజా సూరజ్‌మాల్ పాత్రను తప్పుగా చూపించారంటూ ఆ వర్గానికి చెందిన కొంతమంది ఆరోపిస్తున్నారు. పానిపట్ సినిమా జాట్ వర్గీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని సినిమా ప్రదర్శనను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సిన్మా ట్రైలర్ విడుదలవడానికి ముందే అఫ్ఘాన్​ మాజీ రాయబారి షాయిదా అబ్దాలీ ట్విటర్​లో సినిమాపై అనుమానాలు వ్యక్తం చేశారు.

 

ఇండో–అఫ్ఘాన్​ సంబంధాలను దెబ్బతీసేలా తీయవద్దని సూచించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆందోళనకారులు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జైపూర్‌లోని ఓ థియేటర్‌పై దాడి చేశారు. థియేటర్‌లోని అద్దాలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్ మాట్లాడుతూ... సినిమాలు తీస్తే వరి మనోభావాలు దెబ్బతీయకూడదన్నారు. డిస్ట్ట్రిబ్యూటర్లు ఆందోళనకారులతో చర్చలు జరుపాల్సిన అవసరముందని, అలా అయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: