విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘వెంకీ మామ’. వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, పాటలు అన్ని వర్గాల ప్రజలకు కనెక్ట్‌ అయ్యాయి. విడుదలకు మరో వారం రోజుల ఉండటంతో మూవీ ప్రమోషన్స్‌ వేగం పెంచాయి చిత్ర యూనిట్‌. వాస్త‌వానికి  ‘ప్రేమమ్’ చిత్రంలో తొలిసారి నాగ చైత‌న్య.. వెంక‌టేష్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మ‌ళ్లీ  కే ఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెంకీమామ’లో పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నాడు.

 

సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఫైనల్‌గా ఈ సినిమాను డిసెంబర్‌ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. అయితే డిసెంబ‌ర్ 13న వెంక‌టేష్ పుట్టిన‌రోజు కావ‌డం విశేషం. ఈ సినిమాలో వెంకీ, చైతూ ఇద్దరు రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నా నటిస్తోంది. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సిన‌మాపై సురేష్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సినిమాను అమెజాన్, నెటిఫ్లిక్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయబోమని ప్రకటించాడు. 

 

అంతేకాదు తొందర్లనే అల్లు అరవింద్, దిల్ రాజులతో కలిసి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా మేమే ఒక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చాడు.అంతేకాదు తెలుగుకు సంబంధించిన సినిమాలే కాదు.. హిందీ, తమిళానికి సంబంధించిన సినిమాలను కూడా కొనుగోలు చేసి ఆయా కంపెనీలు గట్టిపోటీ ఇవ్వాలనే కసి మీద ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అన్ని థియేటర్స్ ఆయా నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. వీళ్లను కాకుండా సినిమాలు విడుదల చేసే ఆస్కారం ఉండదు. కాగా, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌, లవ్‌, రొమాన్స్‌, రిలేషన్‌షిప్‌, మాస్‌ ఇలా అన్నింటిని మేళవించిన వెంకీమామ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: