'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో 'సుడిగాలి సుధీర్' ఒకరు. వారం .. వారం బుల్లితెరపై నవ్వుల సందడి చేస్తూనే, సినిమాల్లోనూ చిన్నచిన్న పాత్రలను వేస్తూ మంచి క్రేజ్ సంపాధించుకున్నారు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. బుల్లితెరపై సుధీర్ చేసే స్కిట్లు ఇంటిల్లిపాదిని కడపుబ్బా నవ్విస్తాయి. అయితే సుడిగాలి సుధీర్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు.. మల్టీటాలెంటెడ్. బుల్లితెరపై ఇలాంటి నటులు అరుదుగా వస్తుంటారు. సింగర్, కమెడియన్, యాక్టర్ కమ్ మెజీషియన్. అంతేకాదు.. మనోడిలో మంచి డాన్సర్ కూడా ఉన్నాడు. అంతేకాదు రష్మీతో అతడి కెమిస్ట్రీ కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యిందనే చెప్పవచ్చు.

 

అయితే సుడిగాలి సుధీర్ కు సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు. ఇక తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో  సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. తనని తీవ్రమైన ఆందోళనకి గురిచేసిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. ఒకసారి నాకు వెన్నెముకకు సంబంధించిన నరాలపై  ట్యూమర్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో.. అది కేన్సర్ ట్యూమరా? నాన్ కేన్సర్ ట్యూమరా? అనేది కూడా తెలియద‌ని చెప్పుకొచ్చారు. మ‌రియు సర్జరీ కూడా కొంచెం క్రిటికల్ అన్నారు.. సక్సెస్ కాకపోతే కాళ్లు పనిచేయవని చెప్పారు. ఆ సమయంలోను .. ఆ ట్యూమర్ ను బయాప్సికి పంపించిన సమయంలోను చాలా భయపడ్డాను. ఆ ట్యూమర్ వలన ఒక ఏడాదిపాటు నరకం అనుభవించాను. 

 

ఎందుకు బతికి ఉన్నానురా బాబూ అనిపించేది. శత్రువులకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకునేవాడిని. కదలకుండా కూర్చునే నిద్రపోవాలి .. మెడ పక్కకి తిప్పినా కరెంట్ షాక్ కొట్టినంత బాధ కలిగేది. అమ్మానాన్నకి తెలియకుండా నేను ఏడ్చిన రాత్రులు ఎన్నో వున్నాయి" అని సుధీర్ చెప్పుకొచ్చాడు. కాగా, త్వరలో సుధీర్‌ వెండితెరపై హీరోగానూ కనిపించనున్నాడు. సుడిగాలి సుధీర్ ప్రధానపాత్రలో రెండు సినిమాలు తెరకేక్కుతున్నాయి. అందులో సోలో హీరోగా వస్తున్న సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా ముందుగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరలో ఉండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. సుధీర్ కు జోడిగా ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నటించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: