మధ్యతరగతిలో పుట్టి, ఎన్నో కష్టాలను అనుభవించి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి సుధీర్.. చిన్న చిన్న మ్యాజిక్ లు చేసుకుంటూ వచ్చిన సుధీర్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టిన సుధీర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో సుడిగాలి సుధీర్ గా టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలను సినిమాలలో చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నో టీవీ షోలకు వ్యాఖ్యత వ్యవరిస్తున్నారు. 

 

అయితే సుడిగాలి సుధీర్ సినిమాల్లో హీరోగా, ప్రముఖ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ఇక తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా ప్రోగ్రాంకు వచ్చాడు.కార్యక్రమంలో 'సుడిగాలి' సుధీర్ మాట్లాడుతూ, తనని తీవ్రమైన ఆందోళనకి గురిచేసిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. "ఒకసారి నాకు వెన్నెముకకు సంబంధించిన నరాలపై 'ట్యూమర్' వచ్చింది. అది ఎందుకు వచ్చిందో .. అది కేన్సర్ ట్యూమరా? నాన్ కేన్సర్ ట్యూమరా? అనేది కూడా తెలియదు.

 

సర్జరీ కొంచెం క్రిటికల్ అన్నారు .. సక్సెస్ కాకపోతే కాళ్లు పనిచేయవని చెప్పారు. ఆ సమయంలోను .. ఆ ట్యూమర్ ను బయాప్సికి పంపించిన సమయంలోను చాలా భయపడ్డాను. ఆ ట్యూమర్ వలన ఒక ఏడాదిపాటు నరకం అనుభవించాను. ఎందుకు బతికి వున్నానురా బాబూ అనిపించేది. శత్రువులకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకునేవాడిని. కదలకుండా కూర్చునే నిద్రపోవాలి .. మెడ పక్కకి తిప్పినా కరెంట్ షాక్ కొట్టినంత బాధ కలిగేది. అమ్మానాన్నకి తెలియకుండా నేను ఏడ్చిన రాత్రులు ఎన్నో వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.

 

ఇక రష్మీ ప్రస్తావన రావడంతో సుధీర్ ఒక్కసారిగా నవ్వాడు. తన నాకు మంచి ఫ్రెండ్.. నేను ఇంతగా ఫెమస్ అయ్యానంటే కారణం తానే.. నా జీవితాన్ని ప్రసాదించిన దేవత రష్మీ. ఎవరేమనుకున్నా కూడా రాసుకొనిలే అని వదిలేసిందా అలా ఇంకా పాపులర్ అయ్యాము. నిజం చెప్పాలంటే మా అమ్మ తర్వాత అమ్మ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అంటూ  అన్నారు. ఈ షో చుసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా వీరిద్దరిని ట్రోల్స్ వెయ్యడం మానేస్తారేమో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: