బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో కామెడీ ప్రోగ్రామ్స్ వచ్చాయి. కామెడీ షో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కపిల్ శర్మ ఈ ప్రోగ్రామ్ తో ఎంతో పాపులారిటీ సంపాదించారు.  2013లో ఫోర్బ్స్ సంస్థ భారతీయ సెలబ్రటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది. 2013లో ఎంటర్టైన్మెంట్ క్యాటగిరీలో సి.ఎన్.ఎన్-ఐబిఎన్ కపిల్ ను ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది.  భారత ప్రధాని నరేంద్రమోడి కపిల్ ను స్వచ్ఛ  భారత్ అభియాన్ కు ఎంపిక చేశారు. కపిల్ శర్మ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జీతేంద్ర కుమార్ పంజాబ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు.. ఆ మద్య క్యాన్సర్ తో మరణించారు.  

 

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో కామెడీ సర్కస్ లో చేశారు. తర్వాత ఝలక్ ధికలాజా సీజన్ 6, కామెడీ షో చోటే మియాన్ లకు  వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉస్తాదోం కా ఉస్తాద్ షోలో కూడా పాల్గొన్నారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ షో తరువాత సోనీ టివిలో ది కపిల్ శర్మ షోను 2016 ఏప్రిల్ 23న మొదలుపెట్టారు. క‌పిల్ శ‌ర్మ త‌న గార్ల్ ఫ్రెండ్ గిన్నీ ఛ‌త్రాత్ ని జ‌లంద‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌గ్వ‌రా అనే ప్రాంతంలో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  కొంత కాలంగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అయ్యింది.

 

 పెద్దల అంగీకారంతో సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు కపిల్ శర్మ. అప్పట్లో క‌పిల్ త‌న పెళ్ళిని ‘కపిల్‌ శర్మా కీ షాదీ హై!! పూరే ఇండియా కో ఆనా హై’ పేరుతో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 12న వీరికి వివాహం కాగా, రీసెంట్‌గా ఈ దంప‌తుల ఇంట ఆనందం వెల్లివిరిసింది. క‌పిల్ భార్య గిన్నీ పండంటి కూతురికి జ‌న్మ‌నివ్వ‌గా, త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. క‌పిల్‌కి ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: