ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ఇటీవల పీకు, పద్మావత్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ లు అందుకుంది. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ, ప్రేక్షకులను ఆలోచింపచేసే చిత్రాల్లో నటించడంలో ముందుండే దీపికా పడుకొనే, ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఛపాక్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి వీక్షకుల నుండి విశేషమైన స్పందనను రాబడుతోంది. 2005లో లక్ష్మి అగర్వాల్ అనే అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని కోపంతో ఒక వ్యక్తి ఆమె పై ఘోరంగా యాసిడ్ దాడి చేసాడు. 

 

అప్పట్లో పెను సంచలనం రేపిన ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ఛపాక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ దాడి తరువాత లక్ష్మి అగర్వాల్ ముఖం మూడొంతులు పైగా కాలిపోయింది. కాగా ఆ ఘటన తరువాత ఆమె మాట్లాడుతూ, అతడు నా అందాన్ని చెడగొట్టాడు కానీ, నా ఆత్మవిశ్వాసాన్ని కాదు. దేశంలో తనవంటి కొందరు ఆడపిల్లల పై ఈ విధంగా జరిగే దాడులకు ప్రభుత్వాలు అడ్డుకట్టవేయాలని ఆమె కోరడం జరిగింది. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న ఛపాక్ సినిమాలో లక్ష్మి అగర్వాల్ పాత్రలో దీపికా పాడుకొనే సహజత్వ నటనతో ఆకట్టుకున్నారు. 

 

మాకు న్యాయం చేయండి, న్యాయం కావాలి అంటూ కొందరు యువత ఆందోళన చేస్తున్న సీన్స్ తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ లో 'నా వంటి అమ్మాయిల జీవితాలు కాపాడాలంటే మన దేశంలో యాసిడ్ అమ్మకాలు నిషేధించా'లి, 'అతడు నా ముఖాన్ని నాశనం చేసి ఆనందిస్తున్నాడు, కానీ నా ఆత్మవిశ్వసాన్ని మాత్రం అతడు దెబ్బకొట్టలేకపోయాడు' అంటూ దీపికా పడుకొనే పలికిన డైలాగ్స్ ఎంతో ఆలోచింపచేస్తాయి. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు రాజీ మూవీ ఫేమ్ గుల్జార్ దర్శకత్వం వహించారు .కాగా ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: