ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.  ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే.  సినిమా పేరు ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది.  బహుశా జనవరి 1 వ తేదీన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉంది.  ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నారు.  అప్పుడెప్పుడో ఎన్టీఆర్, చరణ్ లకు సంబంధించిన ఓ లుక్ ను రిలీజ్ చేశారు.  


తరువాత ఇప్పటి వరకు మరో లుక్ రిలీజ్ చేయలేదు.  సినిమా లుక్ కోసం ఎన్టీఆర్, మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.  సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా, లుక్స్ విషయంలోనే ఇంతటి కఠినంగా ఉండటంతో అభిమానులు ఒకింత నిరాశ చెందుతున్నారు.  కనీసం ఒక్క లుక్ అయినా రిలీజ్ చేయండని   అడుగుతున్నారు.  కానీ, దర్శకుడు రాజమౌళి మాత్రం అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు.  


దీంతో అభిమానులు తమ మెదడుకు, క్రియేటివిటీకి పని చెప్తూ వివిధ గెటప్స్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫోటోలను రెడీ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  అచ్చంగా రియల్ పోస్టర్స్ లా ఉండటంతో ఇదే నిజమైన పోస్టర్స్ అనుకోని అభిమానులు వాటిని షేర్ చేస్తున్నారు.  వైరల్ చేస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖ జిల్లా  పాడేరులోని మోదకొండమ్మ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నది.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి విశాఖకు ఎన్టీఆర్ వచ్చిన సమయంలో ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ ను గుర్తుపట్టిన  కొందరు ఫోటోలు తీశారు.  ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఆర్ఆర్ఆర్ ఫోటోలు ఎలాగో రిలీజ్ చేయలేదు.  కనీసం ఇలాగైనా ఎన్టీఆర్ ఫోటోను చూసి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: