తన కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా అదిరిపోయే హిట్ అవటంతో మంచి జోష్ మీద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో నెక్స్ట్ సినిమా కొరటాలతో చేయబోయే సినిమా విషయంలో మరి ఇంత స్థాయిలో సినిమా విజయం అవ్వాలని సినిమా కోసం స్లిమ్ అవుతున్నాడు. దీంతో ప్రస్తుతం జిమ్ లో స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్లు చేస్తూ సినిమా కోసం ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి కష్టపడుతున్నారు. కాగా దసరా పండుగ నాడు కొరటాలతో చేయబోయే సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టిన చిరంజీవి… రెగ్యులర్ షూటింగ్ మాత్రం జనవరి నెలలో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

 

అంతేకాకుండా అతి తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేసి మెగా అభిమానులను అలరించాలని చిరంజీవి డిసైడ్ అయ్యారట. విషయంలోకి వెళితే సైరా సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు టైం తీసుకోవడంతో...కొరటాలతో చేయబోయే సినిమా విషయంలో అంత టైం లేకుండా తక్కువ టైంలోనే సినిమా కంప్లీట్ చేసే విధంగా డైరెక్టర్ కొరటాల షెడ్యూల్ ప్రిపేర్ చేయాలని ముందే చిరంజీవి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా కోసం కొరటాల శివ - చిరంజీవిని సరికొత్తగా చూపించడం కోసం సరికొత్త ప్లాన్ వేసినట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాకుండా స్క్రీన్ ప్లేలో ఈ సారి చాలా స్ట్రాంగ్ ట్విస్ట్ లో తెరపై ప్రజెంట్ చేయబోతున్నాడట. ఇక రామోజీ ఫిలిం సిటీలో స్ఇప్పటికే కొన్ని స్పెషల్ సెట్స్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం కి సంబందించిన ఒకప్పటి  వాతావరణాన్ని సినిమాలో స్పెషల్ గా ప్రజెంట్ చేయటానికి కొరటాల భారీ సెట్లు వేయబోతున్నట్లు యాక్షన్ సన్నివేశాలు కూడా అదేరీతిలో ఉండేటట్లు కొరటాల సినిమా డిజైన్ చేయబోతున్నట్లు... సినిమా తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేసే విధంగా సరికొత్త ప్లానింగ్ తో కొరటాల షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: